టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ పురుషుల్లో ఉత్పత్తి అవుతుంది. వృషణాలు ఈ హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఈ హార్మోన్ వల్ల శుక్ర కణాలు తయారవుతాయి. అలాగే పురుషుల్లో శృంగార సామర్థ్యం పెరుగుతుంది. అయితే ఒక పురుషుడిలో ఒక డెసిలీటర్‌కు 300 నానోగ్రాముల కన్నా తక్కువగా టెస్టోస్టిరాన్ స్థాయిలు ఉంటే అప్పుడు ఆ వ్యక్తిలో టెస్టోస్టిరాన్ హార్మోన్ తక్కువగా ఉన్నట్లు నిర్దారిస్తారు. ఈ క్రమంలోనే ఈ హార్మోన్ స్థాయిలు తక్కువగా ఉంటే శరీరంలో పలు లక్షణాలు కనిపిస్తాయి. అవేమిటంటే…
1. పురుషులు శృంగారం పట్ల అంతగా ఆసక్తి చూపించడం లేదంటే టెస్టోస్టిరాన్ స్థాయిలు తగ్గినట్లేనని అర్థం చేసుకోవాలి.
2. టెస్టోస్టిరాన్ స్థాయిలు తక్కువగా ఉన్న వారిలో అంగ స్తంభనలు సరిగ్గా ఉండవు.
3. ఈ హార్మోన్ తగ్గితే వీర్యం కూడా చాలా తక్కువగా ఉత్పత్తి అవుతుంది. అలాగే ఆ ఉత్పత్తి అయ్యే వీర్యంలో శుక్ర కణాల సంఖ్య కూడా తక్కువగా ఉంటుంది.
4. శరీరంలో ఈస్ట్రోజన్ స్థాయిలు పెరిగితే పురుషుల్లో ఆడవారిలోలా స్తనాలు పెరుగుతాయి. అలాంటి వారిలో సహజంగానే టెస్టో స్టిరాన్ తక్కువగా ఉంటుంది. కొవ్వు అధికంగా ఉండే వారిలో ఇలా జరుగుతుంది.
5. టెస్టోస్టిరాన్ స్థాయిలు తక్కువగా ఉండే వారిలో జననావయవాల వద్ద ఒక్కోసారి ఎలాంటి స్పందనా కనిపించదు.
6. పురుషులు ఎలాంటి శారీరక శ్రమ చేయకపోయినా అలసిపోయినట్లు అవుతుంటే వారిలో టెస్టో స్టిరాన్ స్థాయిలు తక్కువగా ఉన్నట్లు అర్థం చేసుకోవాలి.
7. టెస్టోస్టిరాన్ స్థాయిలు తక్కువగా ఉండే వారు సహజంగానే డిప్రెషన్ బారిన పడుతారని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
8. టెస్టోస్టిరాన్ తక్కువగా ఉన్నవారు శక్తి లేనట్లుగా నిస్సత్తువగా ఫీలవుతుంటారు. శక్తి లేనట్లు అనిపిస్తుంది.
9. టెస్టోస్టిరాన్ తగ్గితే కండరాలు బలహీనమవుతాయి. ఎముకల్లో సాంద్రత తగ్గుతుంది.
10. టెస్టోస్టిరాన్ స్థాయిలు తక్కువగా ఉన్న పురుషులు మాటి మాటికీ చిరాకు పడుతుంటారని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల్లో వెల్లడైంది.
ఈ లక్షణాలు ఉంటే డాక్టర్‌ను సంప్రదించి చికిత్స తీసుకోవడం ద్వారా టెస్టోస్టిరాన్ స్థాయిలను పెంచుకోవచ్చు. దీంతో ఆయా సమస్యలు తగ్గుతాయి.