పెరుగుతున్న నాగరికత కారణంగా వ్యాధులు కూడా అధికమవుతున్నాయి. వాటిలో మానవులు ప్రధానంగా ఎదుర్కొనే వ్యాధి గుండె జబ్బు కాగా, గుండె జబ్బుల నివారణ సంబంధిత సమస్యలపై రీసెర్చి కూడా విస్తృతంగా జరుగుతోంది. గుండె జబ్బులతో బాధలు పడేవారి వైద్యానికి గాను సైంటిస్టులు ఇకపై గుండె కణాలు లేబరేటరీలోనే తయారు చేయటానికి ఖచ్చితమైన మార్గాలు కనిపెట్టారు.
లండన్ లోనిమొనాషా యూనివర్శిటీ చేసిన ఈ రీసెర్చి లో మానవ గుండె కణాలు స్టెమ్ సెల్స్ నుండి ఎలా తయారు చేయవచ్చో రీసెర్చిలో తెలిపారు. అంతేకాదు వీటికవసరమైన మందులు కూడా కనిపెట్టే పరిశోధనలో వున్నారు. కణాల తయారీ పద్ధతికిగాను ఈ రీసెర్చి బృందం ఆస్ట్రేలియా, ఇతర దేశాల తో కలసి పరిశోధనలు సాగించిందని నేచర్ మెధడ్స్ జర్నల్ తెలిపింది.
గుండె వ్యాధుల రోగుల స్టెమ్ సెల్స్ నుండి తీసిన కణాలతో ఈ గుండె కణాలు తయారు చేయవచ్చని పరిశోధకులు తెలుపుతున్నారు. గుండె వ్యాధుల వైద్యానికవసరమైన మందులు తయారు చేయటంలో ఇంతవరకు కష్టంగా వుండేదని, ఇకపై లేబరేటరీలలో తయారయ్యే గుండె కణాలు తమ మందుల రీసెర్చి విస్తృతంగా జరిగేందుకు కూడా తోడ్పడగలవని పరిశోధకుడు ఎలియట్ తెలిపారు.