జుట్టు రాలే సమస్య దాదాపుగా చాలా మందికి ఉంటుంది. జుట్టు రాలేందుకు అనేక కారణాలు ఉంటాయి. అయితే ఈ సమస్య స్త్రీల కన్నా పురుషులను ఆందోళనకు గురి చేస్తుంది. ఎందుకంటే వారికి జుట్టు రాలడం మొదలైతే అది బట్టతలగా మారుతుందేమోనని భయం. అందుకని వారు జుట్టు రాలకుండా ఉండేందుకు పలు మార్గాలను అనుసరిస్తుంటారు. అయితే ఇప్పుడు చెప్పబోయే చిట్కాలను స్త్రీ, పురుషులు ఎవరైనా పాటించవచ్చు. దీంతో జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. మరి ఆ చిట్కాలు ఏమిటంటే..
1. కొన్ని ఉల్లిపాయలను తీసుకుని మెత్తని పేస్ట్‌లా చేయాలి. ఆ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు తగిలేలా బాగా మర్దనా చేయాలి. తరువాత కొంత సేపు ఆగి తలస్నానం చేయాలి. తరచూ ఇలా చేస్తుంటే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. దీంతోపాటు శిరోజాలు దృఢంగా, ఒత్తుగా పెరుగుతాయి. ఉల్లిపాయల్లో ఉండే సల్ఫర్ జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది. అందువల్ల ఉల్లిపాయ రసాన్ని ఉపయోగిస్తే మంచిది.
2. ఉల్లిపాయలను బాగా దంచి ఆ మిశ్రమంలో కొద్దిగా కొబ్బరి నూనెను కలిపి జుట్టు కుదుళ్లకు తగిలేలా బాగా మర్దనా చేయాలి. తరువాత తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తుంటే అన్ని రకాల జుట్టు సమస్యలు తగ్గుతాయి. దీనివల్ల శిరోజాలు ఒత్తుగా పెరుగుతాయి. కుదుళ్లు దృఢంగా మారుతాయి. శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయి. ప్రకాశవంతంగా మారుతాయి.
3. ఉల్లిపాయలను మెత్తగా దంచి వాటి నుంచి తీసిన రసంలో కొద్దిగా తేనె, నిమ్మరసం కలపాలి. ఆ మిశ్రమాన్ని కుదుళ్లకు తగిలేలా పట్టించాలి. అనంతరం 30 నిమిషాల పాటు వేచి ఉండాలి. తరువాత తలస్నానం చేయాలి. తరచూ ఇలా చేస్తే చుండ్రు సమస్య తగ్గుతుంది. జుట్టు రాలడాన్ని ఆపవచ్చు. శిరోజాలు దృఢంగా, ఒత్తుగా పెరుగుతాయి.