గుండె రక్తనాళాలలో ఏర్పడే గడ్డలు క్రమేణా రక్తనాళాలను గట్టిపడేసి రక్తప్రవాహం గుండెకు ఆపేస్తాయి. ఇదే సమయంలో శరీరం తనను తాను రక్షించుకునేటందుకు వ్యాయామం చేసే వ్యక్తులయితే, గుండెకు సమాంతరంగా వెళ్ళే రక్తనాళాలను ఉపయోగించి రక్తం సరఫరా చేస్తాయి. ఈ సమాంతర రక్త ప్రసరణ జరుగకుంటే, గుండె పూర్తిగా విఫలమైనట్లే. ఫలితంగా గుండె బలహీనపడటం దాని చర్య తగ్గిపోవటం జరుగుతుంది.
గుండెకుగల వ్యాయామ సామర్ధ్యాన్ని మెటబాలిక్ ప్రక్రియగాను మరియు స్ట్రెస్ టెస్ట్ గా పరీక్షలు చేస్తారు. బ్లాక్ అయిన రక్తనాళాలకు సమాంతర రక్త సరఫరా ఎలా చేయాలి? గుండెకు సమాంతర రక్తనాళాలతో రక్త సరఫరా చేయవచ్చునని పరిశోధకులు చెపుతున్నారు. గుండెపోటు సమయంలో రక్తనాళాలలో గడ్డలు ఏర్పడతాయి. బ్లడ్ ప్రెజర్, డయాబెటీస్ మిలిటస్ మొదలగు వ్యాధులు అధికంగా వుండే వారిలో శరీరంలో రక్తస్రావం కూడా జరుగుతుంది.
ఈ రక్తపుగడ్డలు చిన్నపాటి ధమనులలో నిలబడిపోతాయి. దీనితో రక్త సరఫరా ఆగి ప్రధాన అవయవం డిస్టల్ కండరానికి పోషణ అందదు. ఇది కనుక అధిక సమయం కొనసాగితే, అవయవం మొద్దుబారి, గుండె పోటు వస్తుంది. అయితే, సమాంతరంగా ఏర్పడే రక్తనాళాలు సహజ రక్తనాళాలకంటే బలహీనంగా వుండి రక్తాన్ని అధికంగా తీసుకు వెళ్ళ లేవు. వ్యాయామాలు చేయని వారిలో గుండె విఫలత చెందితే పరిణామాలు మరింత వేగంగా వుంటాయని వైద్యులు చెపుతారు. ఫలితంగా గుండె బలహీనపడి వైద్యానికి సైతం కష్టమవుతుంది.