Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home ఆధ్యాత్మికం

ఈ ఆలయానికి కనిపించని విషసర్పాలు కాపలా..! సముద్రపు అల వస్తే మెట్లు కనిపించవు..! ఎలా వెళ్లాలో తెలుసా..?

Admin by Admin
May 6, 2025
in ఆధ్యాత్మికం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఇండోనేషియా సమీపంలో ఉండే బాలి దేశం పేరు మీరెప్పుడైనా విన్నారా..? ఈ దేశం మాత్రమే కాదు చుట్టూ అనేక దేశాలు ఉంటాయి. అవన్నీ దీవుల్లో ఉంటాయి. ఈ దీవులన్నీ హిందూ మహాసముద్రం పరిధిలోకి వస్తాయి. అయితే బాలి దేశం దీవుల చుట్టూ ఆవరించి ఉన్న సముద్రాన్ని మాత్రం జావా సముద్రమని పిలుస్తారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. ఈ బాలి దేశంలో మహాసముద్రంలో ఉండే ఓ చిన్నపాటి కొండపై ఓ హిందూ దేవాలయం ఉంది. ఇది చాలా ఏళ్ల కిందటి నాటిదని చెబుతారు. ఈ దేవాలయం ప్రత్యేకత ఏమిటంటే.. బాలిలోని తబనాన్ అనే ప్రాంతంలో మహాసముద్రంలో కొండపై ఉన్న ఆలయాన్ని తనాహ్ లాట్ టెంపుల్ అని పిలుస్తారు. ఇది హిందూ దేవాలయం. ఇక్కడ సముద్రం, భూమి రెండూ కలసి దైవంగా ఏర్పడ్డాయని నమ్ముతారు. ఈ ఆలయం చుట్టూ మహాసముద్రం ఉండడం వల్ల పెద్ద ఎత్తున అలలు వస్తుంటాయి. ఒకసారి అల వస్తే ఆలయం మెట్లన్నీ అందులో మునిగిపోతాయి. అల వెళ్లగానే ఆ మెట్లు మనకు కనిపిస్తాయి. ఆ సమయంలోనే ఆ ఆలయంలోకి వెళ్లాల్సి ఉంటుంది. లేదంటే అల వచ్చినప్పుడు మెట్లపైనే ఉంటే ఆ అలతోపాటే సముద్రంలోకి వెళ్తారు.

ఇక ఈ ఆలయం చుట్టూ ఉన్న చిన్న చిన్న దీవులను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దారు. దీంతో ఇక్కడికి టూరిస్టులు కూడా పెద్ద ఎత్తున వస్తుంటారు. కాగా ఈ ఆలయం కింది భాగంలో అత్యంత పురాతన వస్తువులు ఎంతో విలువైనవి ఉన్నాయట. కానీ వాటికి కంటికి కనిపించని విష సర్పాలు కాపలాగా ఉంటాయట. ఎవరైనా ఆ వస్తువులను దొంగిలించాలని చూస్తే అవి కాటు వేసి చంపుతాయని ఇక్కడి స్థానికులు చెబుతారు. ఇక ఈ ఆలయంలో ఉండే మరో విశేషమేమిటంటే.. ఈ ఆలయం మొత్తం ఒకే రాయిపై ఉంటుంది. పెద్ద బండను ఆలయంగా చెక్కారు.

bali temple interesting facts to know

దీంతో ఆలయ పరిసరాలు చాలా ప్రకృతి మనోహరంగా ఉంటాయి. ఇక ఉదయం, సాయంత్రం వేళ్లలో సూర్యోదయం, సూర్యాస్తమయాలను చూసేందుకు రెండు కళ్లు చాలవంటే నమ్మండి. అంతటి సుందరంగా ఈ ఆలయ పరిసరాలు దర్శనమిస్తాయి. అయితే ఈ ఆలయానికి వెళ్లాలంటే చాలా ఎక్కువ ఖర్చు పెట్టాల్సి ఉంటుందట. ఎందుకంటే ఇక్కడ ప్రాణాపాయ పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి.. రక్షణ చర్యలకు ఆ మాత్రం ఎక్కువ డబ్బును పర్యాటకుల నుంచి వసూలు చేస్తారు లెండి. ఏది ఏమైనా ఈ ఆలయ విశిష్టతలు భలే ఆశ్చర్యంగా ఉన్నాయి కదూ.

Tags: bali temple
Previous Post

ఎంత‌గానో ప్రేమించే భార్యను పోగొట్టుకున్న త‌రువాత కానీ ఆ భ‌ర్త‌కు అస‌లు విష‌యం తెలిసి రాలేదు..!

Next Post

ఇటీవ‌ల నేను చూసిన అతి పెద్ద బోరింగ్ సినిమాల్లో ఇదొక‌టి..!

Related Posts

lifestyle

కేజీ ప‌ల్లీల ధ‌ర రూ.180, ప‌ల్లి నూనెను కేజీకి రూ.150కి ఎలా అమ్ముతున్నారు..?

July 1, 2025
Home Tips

మీ ఫ్రిజ్ నుంచి దుర్వాస‌న వ‌స్తుందా.. అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

July 1, 2025
ఆధ్యాత్మికం

మీకు ఇలాంటి క‌ల‌లు వ‌స్తున్నాయా..? అయితే మీ స‌మస్య‌లు త్వ‌ర‌లో పోతాయ‌ని అర్థం..!

July 1, 2025
పోష‌ణ‌

ఈ ఒక్కటి తింటే చాలు ఈ కాలంలో సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టొచ్చు..!!

July 1, 2025
technology

WI-FI రూటర్ వేగానికి చిన్న ట్రిక్స్.. రెప్పపాటులో హెచ్‌డీ వీడియోలు డౌన్‌లోడ్

July 1, 2025
హెల్త్ టిప్స్

మద్యం సేవిస్తున్న సాయంలో పొరపాటున కూడా తినకూడని 5 పదార్థాలు ! మీ ఆరోగ్యానికే ముప్పు జాగ్రత్త !

July 1, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.