ఏయే సమస్యలు వచ్చినప్పుడు డాక్టర్‌ను కలవాలి..? తెలుసుకోండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">మనకు ఎప్పటికప్పుడు అనారోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి&period; కొన్ని సమస్యలు ఎలాంటి చికిత్స తీసుకోకపోయినా అవే నయం అవుతాయి&period; కొన్నింటికి చికిత్స అవసరం అవుతుంది&period; అయితే కొన్ని అనారోగ్య సమస్యలకు మాత్రం దీర్ఘకాలం చికిత్స లేదా సర్జరీ వంటివి అవసరం అవుతుంటాయి&period; కానీ ఏ అనారోగ్య సమస్య వచ్చినా మన శరీరం పలు లక్షణాలను చూపిస్తుంది&period; వాటిని గమనించి డాక్టర్‌ వద్దకు వెళ్లి పరీక్షలు చేయించుకుని అవసరం అయిన మేర మందులను వాడుకోవాలి&period; అనారోగ్యాలను నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన సమస్యలుగా మారేందుకు అవకాశం ఉంటుంది&period; కనుక జాగ్రత్త వహించాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-2854 size-large" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;06&sol;doctor-consulation-1024x698&period;jpg" alt&equals;"what is the best time to consult doctor after having unhealthy symptoms " width&equals;"696" height&equals;"474" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలా&comma; కొంత సమయం ఆగాలా &quest; అని చాలా మంది సందేహిస్తుంటారు&period; ఈ క్రమంలోనే ఏయే అనారోగ్య సమస్యలు&comma; లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; ఛాతీలో ఎడమవైపు నొప్పి వస్తుంటే దాన్ని అనుమానించాలి&period; కొందరికి అసిడిటీ వల్ల ఈ నొప్పి వస్తుంది&period; కానీ కొందరిలో గుండె సమస్యలు ఉంటే ఈ నొప్పి వస్తుంది&period; ఏ సమస్య అయిందీ మనకు కచ్చితంగా తెలియదు&period; కనుక ఈ నొప్పి తరచూ వస్తుంటే ఏ మాత్రం అశ్రద్ధ చేయకూడదు&period; వెంటనే డాక్టర్‌ను సంప్రదించి వైద్య పరీక్షలు చేయించుకోవాలి&period; కేవలం అసిడిటీ మాత్రమే అయితే ఫర్వాలేదు&period; కానీ గుండె సమస్య అయితే పరీక్షల్లో తెలుస్తుంది&period; దీంతో ముందుగానే అప్రమత్తమై ప్రాణాలను కాపాడుకోవచ్చు&period; ఛాతిలో వచ్చే నొప్పిని అస్సలు నిర్లక్ష్యం చేయరాదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; కొందరికి తరచూ శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతుంటాయి&period; శ్వాసకోశ సమస్యలు లేదా ఆస్తమా&comma; గుండె సమస్యలు ఉంటే ఇలా జరుగుతుంది&period; కనుక ఈ సమస్య వస్తున్నా నిర్లక్ష్యం చేయరాదు&period; వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకుని చికిత్స తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; కొందరు జ్వరం ఉంటే మెడికల్‌ షాపుకు వెళ్లి మందులను కొని తెచ్చి వేసుకుంటారు&period; సాధారణ జ్వరం అయితే తగ్గుతుంది&period; ఆ మందులను వేసుకున్నా ఫర్వాలేదు&period; కానీ జ్వరం తీవ్రత తగ్గకుండా పెరుగుతున్నా&comma; జ్వరం 102 డిగ్రీలు&comma; అంతకన్నా ఎక్కువగా ఉన్నా నిర్లక్ష్యం చేయరాదు&period; వెంటనే వైద్యున్ని సంప్రదించి చికిత్స తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; సాధారణంగా తలనొప్పి ఎవరికైనా వస్తుంటుంది&period; కానీ ఎంతకూ తగ్గకుండా ఎప్పుడూ తలనొప్పి వస్తున్నా&comma; దాంతోపాటు వాంతులు అవడం&comma; తలతిరగడం&comma; స్పృహ తప్పడం వంటి లక్షణాలు కనిపిస్తున్నా&period;&period; ఏమాత్రం ఆలస్యం చేయకూడదు&period; వెంటనే చికిత్స తీసుకోవాలి&period; డాక్టర్‌ను కచ్చితంగా కలవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; ఏ అవయవాలైన బలహీనం కావడం&comma; మాటలో అస్పష్టత లేదా తాత్కాలిక అంధత్వం&period;&period; వంటి లక్షణాలు కనిపిస్తుంటే పక్షవాతం వస్తుందని అనుమానించాలి&period; ఇవి కొంత సేపు ఉండి మాయమవుతాయి&period; కానీ వీటితోపాటు తల తిరగడం&comma; చికాకు వంటి లక్షణాలు కూడా ఉంటే పక్షవాతం వచ్చేందుకు వాటిని సంకేతాలుగా భావించాలి&period; వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">6&period; ఆరోగ్యవంతమైన వ్యక్తులు రోజుకు ఒకటి లేదా రెండు సార్లు మలవిసర్జన చేస్తారు&period; అయితే రోజూ ఒకే సమయంలో కాకుండా భిన్న సమయాల్లో విరేచన అవుతున్నా&comma; కడుపులో నొప్పి వస్తున్నా&comma; పొట్ట ఆకస్మికంగా పెరిగినా&period;&period; ఆ లక్షణాలను ట్యూమర్‌ లేదా పేగు సంబంధ వ్యాధిగా అనుమానించాలి&period; వైద్యులను సంప్రదించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">7&period; మందులు వాడుతున్నా దగ్గు తగ్గకపోవడం&comma; నెల రోజులకు పైగా దగ్గు వస్తుండడం&comma; దగ్గుతోపాటు శ్లేష్మం వస్తుండడం వంటివన్నీ టీబీ &lpar;క్షయ&rpar;కు లక్షణాలు&period; కనుక ఈ లక్షణాలు ఉన్నవారు వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలి&period; అలాగే దగ్గుతోపాటు రక్తం పడుతుంటే పరిస్థితి తీవ్రతరం అయినట్లు గ్రహించాలి&period; ఏమాత్రం ఆలస్యం చేయకుండా డాక్టర్‌ను కలవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">8&period; చేతులు&comma; పాదాలు లేదా వేళ్లు ఉదయాన్నే వాపు ఉన్నట్లు కనిపిస్తుంటే అది గుండె లేదా మూత్ర పిండాలకు సంబంధించిన సమస్య అయి ఉంటుంది&period; ఈ లక్షణం కనిపించినా ఆలస్యం చేయరాదు&period; వెంటనే డాక్టర్‌ను కలిసి పరీక్షలు చేయించుకుని చికిత్స తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p><strong>ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో à°®‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;t&period;me&sol;ayurvedam365">Ayurvedam365<&sol;a><&sol;p>&NewLine;

Admin

Recent Posts