వైద్య విజ్ఞానం

బొడ్డులో కాటన్‌ తరహాలో ఉండే పదార్థం ఏమిటి ? అది ప్రమాదకరమా ?

బొడ్డు అనేది అందరికీ ఒకేలా ఉండదు. భిన్నంగా ఉంటుంది. కొందరికి అది పైకి వచ్చి ఉంటుంది. రంధ్రంలా ఉండదు. కొందరికి లోపలికి ఉంటుంది. అయితే బొడ్డులో సాధారణంగానే వ్యర్థాలు పేరుకుపోతుంటాయి. అది మనకు కాటన్‌ రూపంలో కనిపిస్తుంది. అయితే అసలు ఆ పదార్థం ఏమిటి ? అది మనకు ప్రమాదాన్ని కలిగిస్తుందా ? అంటే..

what is the substance that exists in navel what is the substance that exists in navel

బొడ్డు వద్ద వెంట్రుకల పెరుగుదల భిన్నంగా ఉంటుంది. దీని వల్ల బొడ్డులోకి అనేక చిన్న చిన్న పదార్థాలు ఆకర్షితమవుతాయి. మనం ధరించే దుస్తులకు చెందిన పోగులు, రాత్రి కప్పుకునే దుప్పట్లు, ఇతర బెడ్‌ షీట్లకు చెందిన పోగులు, మృత చర్మ కణాలు, దుమ్ము, కొవ్వు కణాలు అన్ని చిన్న పదార్థాల రూపంలో బొడ్డు వైపుకు ఆకర్షించబడతాయి. దీంతో బొడ్డులో వ్యర్థాలు పేరుకుపోతాయి. అవి కాటన్‌లా కనిపిస్తాయి. దీన్ని fluff లేదా lint అని పిలుస్తారు.

అయితే బొడ్డు వద్ద వెంట్రుకల పెరుగుదల జరిగితే ఆ వ్యర్థాలు అవే ఆటోమేటిగ్గా తొలగిపోతాయి. కానీ కొందరిలో అలా జరగదు. అలాంటి వారు బొడ్డును ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. వారానికి ఒకసారి బొడ్డులో నువ్వుల నూనె వేసి కడగాలి. దీంతో బొడ్డు శుభ్రమవుతుంది. ఎప్పటికప్పుడు ఇలా చేస్తుంటే వ్యర్థాలు పేరుకుపోవు.

ఇక పాత దుస్తుల నుంచి చిన్న చిన్న పోగులు ఎక్కువగా వస్తుంటాయి. కనుక పాత దుస్తులను తక్కువగా ధరించాలి. లేదంటే వాటి నుంచి వచ్చే పోగులు బొడ్డులో పేరుకుపోతాయి. అలాగే చర్మాన్ని బాగా శుభ్రం చేసుకోవాలి. దీంతో మృత కణాలు పోతాయి. అవి బొడ్డులో పేరుకుపోవు. బొడ్డు శుభ్రంగా ఉంటుంది.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Admin

Recent Posts