ఆల్కహాల్ నిరుత్సాహపరచే ఔషదం వంటిది. అది బ్రెయిన్ కార్యకలాపాలను కేంద్ర నరాల వ్యవస్ధను బలహీన పరుస్తుంది. అయితే, దానిని మితంగా ఉపయోగిస్తే హాని కలుగదు. ఆనంద పడవచ్చు. మంచికూడా చేస్తుంది. దుర్వినియోగ పరిస్తే ఆరోగ్యాన్ని పాడు చేయటమే కాక, సమాజపర సమస్యలు కూడా కలిగిస్తుంది.
ఆల్కహాల్ ఎంత అధికంగా తాగితే అంత అధికంగా రక్తపోటు పెరుగుతుంది. పెరిగిన రక్తపోటు గుండెపై ప్రభావం చూపుతుంది. ప్రత్యేకించి గుండెపోటు వంటివి వస్తాయి. పరిమితికి మించి ప్రతిరోజూ ఆల్కహాల్ తీసుకుంటే అది లివర్ పాడు చేస్తుంది.
నోటిలో గొంతులో కేన్సర్ కలిగిస్తుంది. పొట్టలో కూడా పుండ్లు పడే అవకాశం వుంది. అంతేకాక మానసిక సమస్యలు కూడా కలిగిస్తుంది. మీరు రెగ్యులర్ గా వాహనం నడిపేవారైనా, మెషినరీ పై పని చేస్తున్నా, ఇతర మందులు వాడేవారైనా ఆల్కహాల్ వాటికి నష్టం వాటింపజేస్తుంది. కనుక ఆల్కహాల్ తక్షణమే మాని గుండె ప్రయోజనాలను కాపాడుకోండి.