Aloo Chicken Kurma : చికెన్ తో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో ఆలూ సోయా చికెన్ కుర్మా కూడా ఒకటి. పేరు చూడగానే ఈ చికెన్ వెరైటీ గురించి మనందరికి తెలిసి పోతుంది. బంగాళాదుంప, సోయా కూర కలిపి చేసే ఈ కుర్మా చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి దీనిని రుచి చూస్తే మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు. చపాతీతో తినడానికి ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఎంతో రుచిగా ఉండే ఈ ఆలూ సోయా చికెన్ కుర్మాను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆలూ సోయా చికెన్ కుర్మా తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉల్లిపాయ – పెద్దది ఒకటి, పచ్చిమిర్చి – 4, నూనె – అర కప్పు, కరివేపాకు – రెండు రెమ్మలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, తరిగిన టమాట – 1, కారం -ఒక టేబుల్ స్పూన్, ధనియాల పొడి -ఒక టేబుల్ స్పూన్, పచ్చి కొబ్బరి – పావు కప్పు, జీడిపప్పు -ఒక టేబుల్ స్పూన్, సార పప్పు -ఒక టేబుల్ స్పూన్, గసగసాలు -ఒక టీ స్పూన్, నీళ్లు – 400 ఎమ్ ఎల్, ఉప్పు – తగినంత, తరిగిన బంగాళాదుంప – 1, తరిగిన సోయకూర – 2 టేబుల్ స్పూన్స్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
ఆలూ సోయా చికెన్ కుర్మా తయారీ విధానం..
ముందుగా చికెన్ ను ఒక గంటపాటు ఉప్పు నీటిలో వేసి నానబెట్టాలి. తరువాత ఒక జార్ లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత అదే జార్ లో పచ్చి కొబ్బరి, గసగసాలు, జీడిపప్పు, సారపప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక కరివేపాకు, మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసి రంగు మారే వరకు వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.
కళ్ల కలక ఎందుకు వస్తుంది.. ఏం చేయాలి.. చిట్కాలు..!
తరువాత టమాట, పసుపు, కారం, ధనియాల పొడి వేసి కలపాలి. టమాట ముక్కలు మెత్తబడిన తరువాత మిక్సీ పట్టుకున్న పచ్చి కొబ్బరి పేస్ట్ వేసి కలపాలి. దీనిని నూనె పైకి తేలే వరకు వేయించిన తరువాత నీళ్లు, ఉప్పు వేసి కలపాలి. తరువాత బంగాళాదుంప ముక్కలు వేసి ఉడికించాలి. ఇవి సగానికి పైగా ఉడికిన తరువాత చికెన్ వేసి కలపాలి. తరువాత మూత పెట్టి చిన్న మంటపై చికెన్ మెత్తగా అయ్యి నూనె పైకి తేలే వరకు ఉడికించాలి. తరువాత కొత్తిమీర, సోయా కూర వేసి కలపాలి. దీనిని మరో 4 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ పోయా చికెన్ కుర్మా తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, రోటీ ఇలా దేనితో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది.