Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Aloo Dum Biryani : ఆలు ద‌మ్ బిర్యానీని ఇలా చేయాలి.. రుచి చూస్తే అస‌లు విడిచిపెట్ట‌రు..

D by D
January 16, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Aloo Dum Biryani : మ‌నం బంగాళాదుంప‌ల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. బంగాళాదుంప‌లను చాలా మంది ఇష్టంగా తింటారు. వీటితో చేసే ఏ వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది. కూర‌లే కాకుండా ఈ బంగాళాదుంప‌ల‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే ఆలూ ధమ్ బిర్యానీని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఆలూ ధ‌మ్ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం చాలా తేలిక‌. బ్యాచిల‌ర్స్, వంట‌రాని వారు, మొద‌టిసారి చేసేవారు కూడా దీనిని సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఆలూ ధ‌మ్ బిర్యానీని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఆలూ ధ‌మ్ బిర్యానీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

పెద్ద ముక్క‌లుగా త‌రిగిన బంగాళాదుంప‌లు – పావు కిలో, పెరుగు – 100 గ్రా., ఉప్పు – త‌గినంత‌, కారం – ఒక టేబుల్ స్పూన్, గ‌రం మ‌సాలా – ఒక టేబుల్ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, త‌రిగిన పుదీనా – కొద్దిగా, ఫ్రైడ్ ఆనియ‌న్స్ – అర క‌ప్పు, నూనె – 2 టేబుల్ స్పూన్స్.

Aloo Dum Biryani recipe in telugu how to make this
Aloo Dum Biryani

మ‌సాలా దినుసులు..

దాల్చిన చెక్క – 2 ఇంచుల ముక్క‌, జాపత్రి – 1, ల‌వంగాలు – 6, యాల‌కులు – 5, సాజీరా – ఒక టీ స్పూన్.

అన్నం త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నాన‌బెట్టిన బాస్మ‌తీ బియ్యం – అర కిలో, నీళ్లు – ఒక లీట‌ర్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, యాల‌కులు – 2, ల‌వంగాలు – 3, ఉప్పు – కొద్దిగా.

ఆలూ ధ‌మ్ బిర్యానీ త‌యారీ విధానం..

ముందుగా బంగాళాదుంప‌ల‌ను ముక్క‌లుగా చేసి వేడి నీటిలో వేసి 5 నిమిషాల పాటు ఉంచాలి. త‌రువాత ఈ ముక్క‌ల‌ను వ‌డ‌క‌ట్టుకుని అడుగు మందంగా ఉండే క‌ళాయిలోకి తీసుకోవాలి. త‌రువాత ఇందులో మ‌సాలా దినుసులు, బిర్యానీ త‌యారీకి కావ‌ల్సిన మిగిలిన ప‌దార్థాల‌న్నీ వేసి బాగా క‌ల‌పాలి. త‌రువాత దీనిపై మూత పెట్టి ప‌క్క‌కు ఉంచాలి. ఇప్పుడు గిన్నెలో ఒక లీట‌ర్ నీటిని పోసి వేడి చేయాలి. ఇందులో బియ్యం త‌ప్ప మిగిలిన ప‌దార్థాలు వేసి నీటిని మ‌రిగించాలి. నీళ్లు మ‌రిగిన త‌రువాత అందులో బియ్యం వేసి క‌ల‌పాలి. ఈ బియ్యాన్ని 50 శాతం వ‌ర‌కు ఉడికించి వ‌డ‌క‌ట్టుకోవాలి. ఇలా ఉడికించిన అన్నాన్ని ముందుగా త‌యారు చేసుకున్న బంగాళాదుంప‌ల‌పై స‌మానంగా వేసుకోవాలి.

త‌రువాత అన్నంపై కొద్దిగా కొత్తిమీర‌, పుదీనా, ఫ్రైడ్ ఆనియ‌న్స్, ఫుడ్ క‌ల‌ర్, 100 ఎమ్ ఎల్ నీళ్లు చ‌ల్లుకుని ఆవిరి పోకుండా మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ క‌ళాయిని స్ట‌వ్ మీద ఉంచి 5 నిమిషాల పాటు పెద్ద మంట‌పై, 15 నిమిషాల పాటు చిన్న మంట‌పై ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. స్ట‌వ్ ఆఫ్ చేసిన త‌రువాత 10 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ త‌రువాత స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ ధ‌మ్ బిర్యానీ త‌యార‌వుతుంది. దీనిని రైతా, మ‌సాలా క‌ర్రీల‌తో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. బంగాళాదుంప‌ల‌తో త‌రచూ చేసే వంట‌కాల‌తో పాటు వీకెండ్స్ లో, స్పెష‌ల్ డేస్ లో ఇలా ధ‌మ్ బిర్యానీని త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.

Tags: Aloo Dum Biryani
Previous Post

Kidney Stones : ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. అయితే కిడ్నీ స్టోన్లు ఉన్న‌ట్లే లెక్క‌..

Next Post

Dondakaya Tomato Pachadi : దొండ‌కాయ‌లు, ట‌మాటాలు క‌లిపి ప‌చ్చ‌డిని ఇలా చేస్తే.. ఎంతో రుచిగా ఉంటుంది..

Related Posts

హెల్త్ టిప్స్

రాత్రి పూట ఇలా చేస్తే ప‌డుకున్న వెంట‌నే నిద్ర ప‌ట్టేస్తుంది..!

July 4, 2025
వైద్య విజ్ఞానం

భార‌తీయ మ‌హిళ‌ల్లో పెరుగుతున్న గ‌ర్భాశ‌య క్యాన్స‌ర్‌.. ఈ ల‌క్ష‌ణాలు ఉంటే జాగ్ర‌త్త‌..!

July 4, 2025
వైద్య విజ్ఞానం

మీకు డ‌యాబెటిస్ ఉందా..? అయితే మీ చ‌ర్మం ఆరోగ్యం ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే..!

July 4, 2025
international

పాకిస్థాన్‌తో భార‌త్ ర‌ద్దు చేసుకున్న నీటి ఒప్పందం క‌రెక్టే అంటారా..?

July 4, 2025
business

ఎలాన్ మస్క్‌ను నేటి తరంలో అత్యుత్తమ శాస్త్రవేత్త అనవచ్చా? కేవలం వ్యాపారవేత్త అనుకోవాలా?

July 4, 2025
inspiration

పేద‌రికాన్ని ఎగ‌తాళి చేయ‌కూడ‌దు.. ప్ర‌తిభ ఎక్క‌డ ఉన్నా ప్రోత్స‌హించాల‌ని చెప్పే క‌థ‌..!

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.