Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Aloo Fried Rice : బ్రేక్ ఫాస్ట్, లంచ్‌.. ఎందులోకి అయినా స‌రే.. 10 నిమిషాల్లో ఈ రైస్‌ను చేయ‌వ‌చ్చు..!

D by D
June 27, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Aloo Fried Rice : మ‌నం వంటింట్లో ర‌క‌ర‌కాల రైస్ వెరైటీల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. మ‌నం సుల‌భంగా చేసుకోద‌గిన రైస్ వెరైటీల‌లో ఆలూ ఫ్రైడ్ రైస్ కూడా ఒక‌టి. బంగాళాదుంప‌ల‌తో చేసే ఈ రైస్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. మిగిలిన అన్నంతో కూడా ఈ రైస్ ను తయారు చేసుకోవ‌చ్చు. బంగాళాదుంప‌ల‌తో త‌ర‌చూ చేసే వంట‌కాల‌తో పాటు అప్పుడ‌ప్పుడూ ఇలా రైస్ ను కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ ఆలూ ఫ్రైడ్ రైస్ ను ఎలా త‌యారు చేసుకోవాలి..అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఆలూ ఫ్రైడ్ రైస్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

అన్నం – ఒక క‌ప్పు బియ్యంతో ఉడికించినంత‌, త‌రిగిన ట‌మాట – 1, త‌రిగిన ఉల్లిపాయ – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర -కొద్దిగా, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, చిన్న ముక్క‌లుగా త‌రిగిన బంగాళాదుంప – పెద్ద‌ది ఒక‌టి, నూనె – 2 టేబుల్ స్పూన్స్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, ఆవాలు -అర టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, ప‌సుపు – పావు టీ స్పూన్, కారం – అర టీ స్పూన్ లేదా త‌గినంత‌, చాట్ మ‌సాలా – అర టీ స్పూన్, గ‌రం మ‌సాలా – అర టీ స్పూన్.

Aloo Fried Rice recipe in telugu make in this method
Aloo Fried Rice

ఆలూ ఫ్రైడ్ రైస్ త‌యారీ విధానం..

ముందుగా అన్నాన్ని పొడి పొడిగా చేసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి.నూనె వేడ‌య్యాక ఆవాలు, జీల‌క‌ర్ర వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు, ప‌చ్చిమిర్చి వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. త‌రువాత బంగాళాదుంప ముక్క‌లు వేసి క‌ల‌పాలి. వీటిపై మూత పెట్టి 3 నిమిషాల పాటు వేయించిన త‌రువాత ట‌మాట ముక్క‌లు, ఉప్పు వేసి క‌ల‌పాలి. తరువాత మూత పెట్టి మ‌రో 4 నిమిషాల పాటు వేయించాలి.

బంగాళాదుంప ముక్క‌లు మెత్త‌గా అయిన త‌రువాత కారం, గ‌రం మ‌సాలా, చాట్ మ‌సాలా, ప‌సుపు వేసి క‌ల‌పాలి. వీటిని నిమిషం పాటు వేయించిన త‌రువాత అన్నం వేసి క‌ల‌పాలి. దీనిని అంతా క‌లిసేలా క‌లుపుకున్న మ‌రో రెండు నిమిషాల పాటు వేయించి కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ ఫ్రైడ్ రైస్ త‌యార‌వుతుంది. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. లంచ్ బాక్స్ లోకి కూడా ఈ రైస్ చాలా చ‌క్క‌గా ఉంటుంది.

Tags: Aloo Fried Rice
Previous Post

Sugandhi Water : లివ‌ర్ క్లీన్ అవుతుంది.. బాడీలో ఉన్న చెత్త బ‌య‌ట‌కు పోతుంది.. దీన్ని ఎలా చేయాలంటే..?

Next Post

Pindi Chutney : ఇడ్లీల‌లోకి ఇలా పిండి చ‌ట్నీని చేయండి.. రుచి అద్భుతంగా ఉంటుంది..!

Related Posts

హెల్త్ టిప్స్

డ‌యాబెటిస్ ఉన్న‌వారు ఈ ఒక్క‌టి తింటే చాలు.. షుగ‌ర్ ఎంత ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే..!

July 5, 2025
ఆధ్యాత్మికం

మ‌న‌కి మంచి రోజులు వ‌చ్చాయ‌ని ఎలా తెలుస్తుంది..?

July 5, 2025
ఆధ్యాత్మికం

ఈ రాశుల‌కు చెందిన వారు ఎట్టి ప‌రిస్థితిలోనూ తాబేలు ఉంగ‌రాన్ని ధ‌రించ‌కూడ‌దు..!

July 5, 2025
ఆధ్యాత్మికం

శివుడికి మీరు వీటితో అభిషేకం చేస్తే.. ఏం కోరుకున్నా నెర‌వేరుతుంది..!

July 5, 2025
lifestyle

ఒంటరిగా ఉన్నప్పుడు నా భార్య ఫోర్స్ చేస్తోంది.. అలా ఉందామంటూ..!!

July 5, 2025
వినోదం

సర్కారు వారి పాటలో ఈ మిస్టేక్ ను గమనించారా? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు అబ్బా!

July 5, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.