సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సినిమా సర్కార్ వారి పాట. ఈ సినిమా భారీ అంచనాల ప్రకారంప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. యువ దర్శకుడు పరశురాం పెట్ల దర్శకత్వం వహించగా, కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించారు. తమన్ సంగీతం అందించారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. సర్కారు వారి పాట సినిమా విజయవంతంగా ప్రదర్శించబడింది. అంతేకాదు ఓటిటిలో కూడా అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకుంది. కొన్ని సినిమాలు థియేటర్లో బోర్ కొట్టినా ఓటీటీలో ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే.
ఇప్పుడు సర్కారు వారి పాట సినిమా పరిస్థితి కూడా అలానే ఉంది. అయితే థియేటర్లో సినిమా చూసేటప్పుడు ప్రేక్షకులు పెద్దగా గమనించరు. కానీ ఓటీటీ లో సినిమా చూసేటప్పుడు మాత్రం ప్రతి సీను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అంతేకాకుండా మిస్టేక్ లను గుర్తించి ట్రోల్ చేస్తున్నారు.
ఇక సర్కార్ వారి పాట సినిమాలో మహేష్ బాబు జైల్లో ఉన్న బ్యాంక్ ఉద్యోగిని నదియా వద్దకు విలన్ ను తీసుకువెళ్లే సీన్ ఉంటుంది. వచ్చేటప్పుడు పండ్లు కూడా తీసుకురావాలని విలన్ కు మహేష్ బాబు ఫోన్లో చెబుతాడు. ఇక విలన్ పండ్లు తీసుకురాగా మహేష్ బాబు, నదియా ను తీసుకోవాలని జైలు కిటికీ వద్ద పెడతారు. కానీ ఆ కిటికీ వద్ద అసలు పండ్లు తీసుకునేందుకు స్పేస్ లేదు. దాంతో అక్కడ స్పే స్ లేదు పండ్లను ఎలా తీసుకుంటారు అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.