ASUS 8z : అసుస్ సంస్థ 8జడ్ పేరిట ఓ నూతన స్మార్ట్ ఫోన్‌ను భారత్ లో విడుదల చేసింది. ఇందులో అనేక ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో 5.9 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ లభిస్తుంది. అందువల్ల డిస్‌ప్లే అదిరిపోయే క్వాలిటీని కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లేకు గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌ను అందిస్తున్నారు.

అసుస్ 8జడ్ స్మార్ట్ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ ఉంది. అందువల్ల 5జి సేవలను ఉపయోగించుకోవచ్చు. ఈ ఫోన్ 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడల్‌లో విడుదలైంది. మెమొరీ కార్డు ఆప్షన్ లేదు. డ్యుయల్ సిమ్‌లను వేసుకోవచ్చు. ఇందులో ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ లభిస్తుంది. దీన్ని ఆండ్రాయిడ్ 12కు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు.
ఈ ఫోన్‌లో వెనుక వైపు 64 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉంది. దీనికి తోడు అదనంగా మరో 12 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ కెమెరాను ఏర్పాటు చేశారు. అలాగే ముందు వైపు 12 మెగాపిక్సల్ కెమెరా ఉంది. వెనుక వైపు గ్లాస్ బ్యాక్ లభిస్తుంది. అందువల్ల ఫోన్ ప్రీమియం లుక్‌లో కనిపిస్తుంది. ఈ ఫోన్‌లో ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ ఫీచర్‌ను అందిస్తున్నారు. ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ లభిస్తుంది. 5జి, డ్యుయల్ 4జి వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.2, యూఎస్‌బీ టైప్ సి, ఎన్ఎఫ్‌సీ వంటి ఇతర ఫీచర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి. ఇందులో 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. దీనికి క్విక్ చార్జ్ 4.0 ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది. కనుక ఫోన్ వేగంగా చార్జింగ్ అవుతుంది.
అసుస్ 8జడ్ స్మార్ట్ ఫోన్ ధర రూ.42,999 ఉండగా.. ఈ ఫోన్‌ను మార్చి 7వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయించనున్నారు.