Theatre : ఇప్పుడంటే కరోనా వల్ల చాలా మంది థియేటర్లకు వెళ్లడమే తగ్గించేశారు. కానీ వాస్తవానికి సినిమాలను థియేటర్లలో చూస్తేనే మజా వస్తుంది. థియేటర్‌లో అయితే ఒకేసారి పెద్ద మొత్తంలో ప్రేక్షకులు సినిమా చూస్తారు కనుక ఆ జోష్, మజా వేరేగా ఉంటాయి. అలాగే సౌండ్ ఎఫెక్ట్స్ కూడా అద్భుతంగా ఉంటాయి. కనుక థియేటర్‌లో సినిమా చూసేందుకే చాలా మంది ఆసక్తిని చూపిస్తుంటారు.
అయితే థియేటర్‌లో అనేక రకాల వరుసల్లో వివిధ క్లాస్‌లలో సీట్లు ఉంటాయి. దీంతో ఎవరి స్థోమతకు, సౌకర్యానికి తగినట్లుగా వారు టిక్కెట్లను కొనుగోలు చేసి చూస్తుంటారు. ఈ క్రమంలోనే కొందరు సీట్ల చివరి భాగంలో కూర్చుని సినిమా చూసేందుకు ఇష్టపడతారు. కొందరు ముందు భాగంలో కూర్చుంటారు. అయితే థియేటర్‌లో సినిమాకు వచ్చే సౌండ్ ఎఫెక్ట్స్‌ను బాగా వినాలన్నా.. అద్భుతమైన సరౌండ్ సౌండ్ ఎఫెక్ట్స్‌ను పొందాలన్నా.. థియేటర్‌లో ఒక నిర్దిష్టమైన స్థలంలో కూర్చుంటేనే మనం ఆ అనుభూతులను పొందగలం.
Theatre : 2/3వ వంతు ప్రదేశంలో..
థియేటర్‌లో ఉన్న మొత్తం సీట్లలో 2/3వ వంతు ప్రదేశంలో ఉన్న సీట్లలో కూర్చోవాలి. లేదా.. 3 వరుసల్లో సీట్లు ఉంటే 2వ వరుసలో మధ్య భాగంలో కూర్చోవాలి. అదే 4 వరుసల్లో సీట్లు ఉంటే.. 2, 3 వరుసల మధ్యలోని సీట్లలో కూర్చోవాలి. దీంతో సినిమా సౌండ్ ఎఫెక్ట్స్, సౌండ్, సరౌండ్ సౌండ్ బాగా వినిపిస్తాయి. ఇలా ఆయా ప్రదేశాల్లో కూర్చుని సినిమా చూస్తే ఇంకా మంచి ఎక్స్‌పీరియెన్స్‌ను పొందవచ్చు. కనుక ఇకపై మీరు ఎప్పుడైనా సినిమాకు వెళితే పైన చెప్పినట్లుగా టిక్కెట్లను బుక్ చేసుకుని వాటిల్లో కూర్చుని ఒకసారి సినిమాను చూసి ఆస్వాదించండి. తరువాత తేడాను మీరే గమనిస్తారు. ఆపై ఎప్పుడు మూవీ చూసినా.. పైన చెప్పిన విధంగానే మీరు సీట్లలో కూర్చుని మూవీని చూస్తారు..!