Anasuya : బుల్లితెరపైనే కాకుండా.. వెండితెరపై కూడా తనకంటూ ఓ గుర్తింపును సొంతం చేసుకున్న నటి, యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఓ వైపు బుల్లితెరపై సందడి చేస్తూనే మరోవైపు సినిమాల్లోనూ రాణిస్తోంది. ఈమెకు అనేక ఆఫర్లు కూడా వస్తున్నాయి. ఈ మధ్యే పుష్ప సినిమాలో దాక్షాయణి పాత్రలో సందడి చేయగా.. ఇటీవలే విడుదలైన ఖిలాడి మూవీలోనూ ఈమె నటించి అలరించింది. సోషల్ మీడియాలోనూ అనసూయ ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది.
అనసూయ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అందులో డెనిమ్ షార్ట్స్, వైట్ కలర్ టాప్స్ ధరించి అనసూయ చెరువు పక్కన సేదదీరుతోంది. ఈ ఫొటోలను ఆమె షేర్ చేయగా.. అవి ట్రెండ్ అవుతున్నాయి. ఇక అనసూయ సినిమాల విషయానికి వస్తే.. ఈమెకు ఎప్పటికప్పుడు వరుస ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈమెకు బాలీవుడ్‌లోనూ చాన్స్‌లు వస్తున్నాయని అంటున్నారు. అయితే ఈ విషయాలపై క్లారిటీ రావల్సి ఉంది.
ఇక పుష్ప సినిమాలో దాక్షాయణిగా అలరించిన అనసూయ అదే మూవీ రెండో పార్ట్‌లోనూ నటించనుంది. ఆ పార్ట్‌లో అనసూయది కాస్త లెంగ్త్ ఎక్కువగానే ఉన్న క్యారెక్టర్ అని తెలుస్తోంది. పుష్ప మొదటి పార్ట్‌లో ఈమెకు ఒకటి, రెండు సీన్లు తప్ప పెద్దగా స్కోప్ లేకుండా పోయింది. కానీ రెండో పార్ట్‌లో ఈమె పాత్ర నిడివి ఎక్కువగానే ఉంటుందని అంటున్నారు.