Catering Style Dondakaya Vepudu : మనం ఆహారంగా తీసుకునే కూరగాయల్లో దొండకాయ కూడా ఒకటి. దొండకాయ కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దొండకాయలతో చేసే ఏ వంటకమైన చాలా రుచిగా ఉంటుంది. ఎక్కువగా ఈ దొండకాయలతో మనం వేపుడును తయారు చేస్తూ ఉంటాము. దొండకాయ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఈ వేపుడును ఇష్టంగా తింటారు. తరుచూ ఒకేరకం స్టైల్ లో కాకుండా ఈ దొండకాయ వేపుడును మనం మరింత రుచిగా కూడా తయారు చేసుకోవచ్చు.
క్యాటరింగ్ స్లైల్ లో చేసే ఈ దొండకాయ వేపుడు కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. అన్నంతో పాటు పప్పు, సాంబార్ వంటి వాటితో సైడ్ డిష్ గా కూడా ఈ వేపుడును తినవచ్చు. క్యాటరింగ్ స్టైల్ లో మరింత రుచిగా దొండకాయ వేపుడును ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
దొండకాయ వేపుడు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 3 టేబుల్ స్పూన్స్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 2, పచ్చిమిర్చి – 3, కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన ఉల్లిపాయ – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, పొడవుగా తరిగిన దొండకాయలు – అరకిలో, పసుపు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, కారం – ఒక టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, గరం మసాలా – పావు టీ స్పూన్, ఎండు కొబ్బరి పొడి – ఒక టేబుల్ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
దొండకాయ వేపుడు తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత తాళింపు దినుసులు, ఎండుమిర్చి వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. వీటిని ఒక నిమిషం పాటు వేయించిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. దీనిని పచ్చి వాసన పోయే వరకు వేయించిన తరువాత దొండకాయలు వేసి కలపాలి. ఇప్పుడు వీటిపై మూత పెట్టి చిన్న మంటపై మధ్య మధ్యలో కలుపుతూ పూర్తిగా వేయించాలి. దొండకాయ ముక్కలు చక్కగా వేగిన తరువాత మిగిలిన పదార్థాలన్నింటిని ఒక్కొక్కటిగా వేసి కలపాలి. ఈ ముక్కలను మరో 2 నిమిషాల పాటు వేయించి కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే దొండకాయ వేపుడు తయారవుతుంది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన దొండకాయ వేపుడును అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.