Chocolate Lassi : లస్సీ.. వేసవి కాలంలో చల్ల చల్లగా దీనిని తాగుతూ ఉంటే ఆ హాయే వేరని చెప్పవచ్చు. పెరుగుతో చేసే ఈ లస్సీని తాగడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. అయితే మనం ఈ లస్సీని వివిధ రుచుల్లో కూడా తయారు చేసుకోవచ్చు. మనం సులభంగా చాలా తక్కువ సమయంలో అలాగే అందరికి నచ్చేలా తయారు చేసుకుని వివిధ రకాల లస్సీ వెరైటీలలో చాక్లెట్ లస్సీ కూడా ఒకటి. చాక్లెట్ పొడి వేసి చేసే ఈ లస్సీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడానికి 5 నిమిషాల సమయం కూడా పట్టదు. ఎంతో రుచిగా కమ్మగా ఉండే ఈ చాక్లెట్ లస్సీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చాక్లెట్ లస్సీ తయారీకి కావల్సిన పదార్థాలు..
చిక్కని తియ్యటి పెరుగు – ఒక కప్పు, కాచి చల్లార్చిన పాలు – పావు కప్పు, ఇన్ స్టాంట్ కాఫీ పొడి – అర టీ స్పూన్, తేనె – 2 టేబుల్ స్పూన్, చాక్లెట్ పొడి – 2 టేబుల్ స్పూన్స్, ఐస్ క్యూబ్స్ – 6 లేదా 7.
చాక్లెట్ లస్సీ తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో పైన చెప్పిన పదార్థాల్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఈ లస్సీని గ్లాస్ లో పోసి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చాక్లెట్ లస్సీ తయారవుతుంది. ఈ లస్సీపై చాక్లెట్ పొడితో లేదా ఐస్ క్రీమ్, డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. చల్ల చల్లగా దీనిని తాగడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. పిల్లలు దీనిని మరింత ఇష్టంగా తాగుతారు.