Coconut Water Juice : కొబ్బరి నీళ్లు.. వీటిని కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ఎండ నుండి ఉపశమనాన్ని పొందడానికి కొబ్బరి నీళ్లను ఎక్కువగా తాగుతూ ఉంటారు. కొబ్బరి నీళ్లను తాగడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. వీటిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటిని తాగడం వల్ల మూత్రపిండాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరం డీహైడ్రేషన్ కు గురి కాకుండా ఉంటుంది. గుండె ఆరోగ్యానికి కొబ్బరి నీళ్లు ఎంతో మేలు చేస్తాయి. ఈ విధంగా కొబ్బరి నీళ్లు మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతో దోహదపడతాయి.
ఈ కొబ్బరి నీళ్లను నేరుగా తాగడంతో పాటు వీటితో మన ఎంతో రుచిగా ఉండే కొకోనట్ జ్యూస్ ను తయారు చేసుకోవచ్చు. ఈ జ్యూస్ ను తయారు చేయడం చాలా తేలిక. కేవలం 5 నిమిషాల్లోనే మనం ఈ జ్యూస్ ను తయారు చేసుకోవచ్చు. కొబ్బరి నీళ్లతో చేసిన ఈ జ్యూస్ ను తాగడం వల్ల మనం రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కొబ్బరి నీళ్లతో జ్యూస్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కొకోనట్ వాటర్ జ్యూస్ తయారీకి కావల్సిన పదార్థాలు..
కొబ్బరి నీళ్లు – రెండు గ్లాసులు, లేత కొబ్బరి – ఒక కప్పు, నానబెట్టిన సజ్బా గింజలు – రెండు టేబుల్ స్పూన్స్, గ్లూకోజ్ పౌడర్ – 2 టీ స్పూన్స్.
కొకోనట్ వాటర్ జ్యూస్ తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో కొబ్బరిని తీసుకోవాలి. తరువాత ఇందులో కొబ్బరి నీళ్లను, గ్లూకోజ్ పౌడర్ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఒక గ్లాస్ లో రెండు టీ స్పూన్ల సబ్జా గింజలను తీసుకోవాలి. తరువాత ఇందులో ముందుగా తయారు చేసుకున్న జ్యూస్ ను పోసి కలిపి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కొకోనట్ వాటర్ జ్యూస్ తయారవుతుంది. దీనిని తాగడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది. ఎండవల్ల శరీరం కోల్పోయిన శక్తి తిరిగి లభిస్తుంది. ఈ విధంగా కొబ్బరి నీళ్లతో జ్యూస్ ను తయారు చేసుకుని తాగడం వల్ల రుచితో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు.