Dhaba Style Paneer Curry : మనకు ధాబాలల్లో లభించే కర్రీలల్లో పనీర్ కర్రీ కూడా ఒకటి. ధాబాల్లలో లభించే ఈ పనీర్ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. రోటీ, చపాతీ, నాన్, జీరా రైస్, పులావ్ రైస్ వంటి వాటితో తింటే ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఈ కర్రీని ఇష్టంగా తింటారు. ఈ పనీర్ కర్రీని మనం కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ధాబా స్టైల్ పనీర్ కర్రీని ఇంట్లోనే చాలా తేలికగా తయారు చేసుకోవచ్చు. స్పెషల్ డేస్ లో, వీకెండ్స్ లో లేదా నోటికి రుచిగా తినాలనిపించినప్పుడు ఇలా పనీర్ కర్రీని తయారు చేసి తీసుకోవచ్చు. ఇంట్లోనే ధాబా స్టైల్ పనీర్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ధాబా స్టైల్ పనీర్ కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
పనీర్ – 200 గ్రా., కారం – అర టీ స్పూన్, ఉప్పు – పావు టీ స్పూన్, ధనియాల పొడి – అర టీ స్పూన్, గరం మసాలా – పావు టీ స్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – పెద్దది ఒకటి, తరిగిన టమాట – పెద్దది ఒకటి.
కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 2 నుండి 3 టేబుల్ స్పూన్స్, బిర్యానీ ఆకు – 1, జీలకర్ర -అర టీ స్పూన్, లవంగాలు – 4, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, కారం – 2 టీ స్పూన్స్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, వేయించిన జీలకర్ర పొడి – అర టీ స్పూన్, చిలికిన పెరుగు – 4 టేబుల్ స్పూన్స్, నీళ్లు – ఒకటిన్నర కప్పు, కసూరిమెంతి – అర టీ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్, కొత్తిమీర – కొద్దిగా.
ధాబా స్టైల్ పనీర్ కర్రీ తయారీ విధానం..
ముందుగా పనీర్ ను ముక్కలుగా కట్ చేసుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి కలపాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత పనీర్ ముక్కలను వేసి 2 నిమిషాల పాటు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే నూనెలో ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తబడే వరకు వేయించాలి. తరువాత టమాటముక్కలు వేసి మెత్తగా అయ్యే వరకు వేయించాలి. టమాట ముక్కలు వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, టమాట ముక్కలను జార్ లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కూర తయారీకి కళాయిలో నూనెలో వేసి వేడి చేయాలి. తరువాత బిర్యానీ ఆకు, లవంగాలు, జీలకర్ర వేసి వేయించాలి.
తరువాత మిక్సీ పట్టుకున్న పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి నూనె పైకి తేలే వరకు వేయించాలి. తరువాత కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కలపాలి. తరువాత పెరుగు వేసి కలపాలి. దీనిపై మూత పెట్టి నూనె పైకి తేలే వరకు వేయించిన తరువాత నీళ్లు పోసికలపాలి. తరువాత మూత పెట్టి మరో 5 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత వేయించిన పనీర్ వేసి కలపాలి. దీనిపై మూత పెట్టి మరో 3 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత కసూరిమెంతి, కొత్తిమీర, గరం మసాలా వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పనీర్ కర్రీ తయారవుతుంది. ఈ విధంగా తయారు చేసిన పనీర్ కర్రీని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.