2 Or 3 Dates Per Day : ఖర్జూర పండ్లు.. మనం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో ఇవి కూడా ఒకటి. ఖర్జూర పండ్లు తియ్యగా చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. అలాగే అనేక రకాల తీపి వంటకాల తయారీలో కూడా పంచదారకు బదులుగా వీటిని వాడుతూ ఉంటారు. ఖర్జూర పండ్లను, అలాగే ఖర్జూర పండ్లతో చేసిన తీపి వంటకాలను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ఖర్జూర పండ్లల్లో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. పోషకాహార నిపుణులు కూడా వీటిని ఆహారంగా తీసుకోవాలని సూచిస్తూ ఉంటారు. ఖర్జూర పండ్లను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ఖర్జూర పండ్లల్లో ఉండే పోషకాలు అలాగే వీటిని తీసుకోవడం వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఖర్జూర పండ్లల్లో పొటాషియం, ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, ఫైబర్, విటమిన్ బి6, కె వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ప్రేగుల కదలికలు పెరుగుతాయి. మలబద్దకం సమస్య తగ్గుతుంది. అలాగే తీపి వంటకాల తయారీలో పంచదారకు బదులుగా ఈ ఖర్జూర పండ్లను వాడడం వల్ల వాటి రుచి పెరగడంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. అదే విధంగా ఖర్జూర పండ్లల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో ఉండే ఫ్రీరాడికల్స్ ను నశింపజేసి శరీర ఆరోగ్యాన్ని కాపాడడంలో మనకు సహాయపడతాయి. ఖర్జూర పండ్లను తీసుకోవడం వల్ల ఎముకలు ధృడంగా తయారవుతాయి. ఎముకలు గుళ్ల బారడం, ఆస్ట్రియోపోరోసిస్ వంటి ఎముకలకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి.
అలాగే ఖర్జూర పండ్లను తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది. వీటిని రోజూ తీసుకోవడం వల్ల శరీరంలో ఐరన్ లోపం రాకుండా ఉంటుంది. రక్తహీనత సమస్య తగ్గుతుంది. రక్తహీనత సమస్యతో బాధపడే వారు ఖర్జూర పండ్లను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే వీటిని తీసుకోవడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. నీరసం, బలహీనత వంటి సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయి. అలాగే బరువు తగ్గడంలో కూడా ఖర్జూర పండ్లు మనకు సహాయపడతాయి. వీటిని తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. చిరుతిళ్లకు బదులుగా ఖర్జూర పండ్లను తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా మనం బరువు తగ్గవచ్చు. ఈ విధంగా ఖర్జూర పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వీటిని తగిన మోతాదులో తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.