Neha Shetty : టాలీవుడ్‌లో యంగ్ హీరోయిన్లకు ప్రస్తుతం బాగా డిమాండ్ ఉంది. ఈ క్రమంలో వారు ఒక సినిమా హిట్ కాగానే రెమ్యునరేషన్‌ను అమాంతం పెంచేస్తున్నారు. ఇటీవలి కాలంలో శ్రీలీల, డింపుల్ హయతిలు మొదటి సినిమాతోనే హిట్ కొట్టి తరువాత భారీ ప్రాజెక్టుల్లో అవకాశాలను దక్కించుకున్నారు. ఈ క్రమంలోనే మరో యంగ్ హీరోయిన్ కూడా ఇదే జాబితాలో చేరింది. తాను నటించిన సినిమా ఈ మధ్యే హిట్ కాగా.. ప్రస్తుతం ఈ అమ్మడు తన రెమ్యునరేషన్‌ను భారీగా పెంచేసిందని తెలుస్తోంది.
సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం.. డీజే టిల్లు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించి మంచి కలెక్షన్స్‌ను రాబడుతోంది. ఈ క్రమంలోనే ఇందులో నటించిన నేహా శెట్టికి ప్రస్తుతం భారీ ప్రాజెక్టుల్లో ఆఫర్లు వస్తున్నాయి. దీంతో ఈమె తన రెమ్యునరేషన్‌ను భారీగా పెంచినట్లు తెలుస్తోంది. నేహా శెట్టి గతంలో దర్శకుడు పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరీతో కలిసి మెహబూబా అనే మూవీలో నటించింది. అయితే ఈ మూవీ అంతగా విజయం సాధించలేదు. అయితే డీజే టిల్లు ద్వారా ఈమె హిట్ కొట్టి సక్సెస్ బాట పట్టింది.
నేహా శెట్టి డీజే టిల్లు మూవీలో చేసిన గ్లామర్ షో, పలు సీన్లకు బి, సి సెంటర్లలో ప్రేక్షకుల నుంచి ఎంతో ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలోనే డీజే టిల్లు మూవీ హిట్ అయింది. అయితే గతంలో రీతూ వర్మ, షాలిని పాండేలు పెళ్లి చూపులు అర్జున్ రెడ్డి సినిమాలతో హిట్ కొట్టారు. కానీ వారు ఆ తరువాత రెమ్యునరేషన్‌ను పెంచేయడంతో సినిమా ఆఫర్లు రాలేదు. మరి నేహా శెట్టి ఈ విషయంలో ఏం చేస్తుందో చూడాలి.