Samsung : ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీదారు శాంసంగ్ ఇటీవలే గెలాక్సీ ఎస్22 సిరీస్ లో పలు నూతన ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్లను విడుదల చేసిన విషయం విదితమే. గెలాక్సీ ఎస్22, ఎస్22 ప్లస్, ఎస్22 అల్ట్రా పేరిట శాంసంగ్ ఆ ఫోన్లను లాంచ్ చేసింది. కాగా భారత్‌లో ఈ ఫోన్ల ధరల వివరాలను ఆ సంస్థ తాజాగా ప్రకటించింది.

శాంసంగ్ గెలాక్సీ ఎస్22 కు చెందిన 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.72,999 ఉండగా.. ఇదే ఫోన్‌కు చెందిన 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.76,999 గా ఉంది. అలాగే గెలాక్సీ ఎస్22 ప్లస్‌కు చెందిన 8జీబీ ర్యామ్, 128 జీబీ మోడల్ ధర రూ.84,999 ఉండగా.. ఇదే ఫోన్‌కు చెందిన 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.88,999గా ఉంది.
ఇక గెలాక్సీ ఎస్ 22 అల్ట్రా ఫోన్‌కు చెందిన 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.1,09,999 ఉండగా.. ఇదే ఫోన్‌కు చెందిన 12జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.1,18,999 గా ఉంది. కాగా ఈ ఫోన్లకు గాను ప్రీ ఆర్డర్లను ఇప్పటికే ప్రారంభించారు. త్వరలో ఈ ఫోన్లపై ఉన్న ఆఫర్లను కూడా ప్రకటించనున్నారు.