DJ Tillu : సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టిలు ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం.. డీజే టిల్లు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మ రథం పట్టారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. సిద్ధు ఈ సినిమాలో తనదైన యాసతో ఆకట్టుకున్నాడు. అలాగే నేహా శెట్టి తన గ్లామర్‌తో అలరించింది.
డీజే టిల్లు మూవీ ఫిబ్రవరి 12వ తేదీన విడుదల కాగా.. ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా సొంతం చేసుకుంది. దీంతో ఆహాలో ఈ మూవీ స్ట్రీమ్ కానుంది. మూవీ విడుదలైన తరువాత 35 రోజులకు.. అంటే.. మార్చి 19వ తేదీ తరువాత ఈ మూవీ ఆహాలో స్ట్రీమ్ అవుతుందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ విషయాన్ని ఆహా నిర్వాహకులు అధికారికంగా వెల్లడించారు.
డీజే టిల్లు సినిమాకు విమల్ కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ మూవీ కామెడీ ఎంటర్‌టైనర్ జోనర్‌లో వచ్చింది. ఇందులో సిద్ధు పక్కన నేహా శెట్టి ఫీమేల్ లీడ్ పాత్రలో నటించింది.