Samantha : నాగచైతన్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన తరువాత సమంత చాలా బిజీగా మారింది. గతంలో ఎన్నడూ లేనంత బిజీగా ఆమె ఇప్పుడు ఉంది. వరుస ప్రాజెక్టుల్లో నటిస్తూ రెండు చేతులా సంపాదిస్తోంది. ఐటమ్ సాంగ్‌లు, సినిమా చాన్స్‌లతోపాటు పలు బ్రాండ్లకు ఈమె ప్రచారకర్తగా ఉంది. సొంతంగా బిజినెస్‌లు కూడా చేస్తోంది. ఇక సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉండే సమంత ఇన్స్టాగ్రామ్ ద్వారా కూడా కోట్ల రూపాయలను సంపాదిస్తోంది.
సమంత ఈ మధ్య కాలంలో ఇన్‌స్టాగ్రామ్‌లో తరచూ యాడ్స్ పోస్ట్ చేస్తోంది. అయితే ఒక్క యాడ్ ను పోస్ట్ చేసినందుకు ఆమె ఏకంగా రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షలు తీసుకుంటుందని తెలుస్తోంది. అది కేవలం యాడ్లను పోస్ట్ చేసిందుకే. వాటిల్లో నటిస్తే ఆమెకు ఇంకా ఎక్కువే ఇవ్వాల్సి వస్తోంది. అలా ఆమె ఒక యాడ్‌కు రూ.1 కోటి వరకు తీసుకుంటుందని సమాచారం. అయితే ఈ మొత్తం ఏడాది కాలానికి వర్తిస్తుంది. ఆ సమయంలో ఆమెతో కంపెనీలు నిర్దిష్టమైన సంఖ్యలో యాడ్స్ తీసుకోవచ్చు. ఇలా తాను ప్రచారం చేసే బ్రాండ్లకు ఇన్స్టాగ్రామ్ ద్వారా భిన్న రకాలుగా రెమ్యునరేషన్‌ను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇక సమంత చివరిగా శాకుంతలం మూవీతో ప్రేక్షకుల ముందుకు రాగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది. అయితే తాజాగా మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు తీవ్రంగా కలత చెందిన ఆమె ఇన్‌స్టా వేదికగా పోస్ట్ పెట్టడంతో మంత్రి కొండా సురేఖ సారీ చెప్పారు. సమంత చివరిగా సిటాడెల్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఆమె ఖాతాలో సినిమాలు ఏమీ లేవు. ఆమె నటించిన యశోద అనే మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది.