Suman : అలనాటి స్టార్ హీరోలలో హీరో సుమన్ ఒకరు. ఎన్నో సినిమాల్లో హీరోగా నటించి అప్పట్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా ఎక్కువ లేడీ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో ఇతనే. ఆ రోజుల్లో సుమన్ అంటే పడి చచ్చే వారు లేడీ అభిమానులు. మన రాష్ట్రం కాకపోయినా తెలుగు ప్రేక్షకులకు తన సినిమా ద్వారా, నటన ద్వారా ఎంతో మందికి చేరువయ్యాడు. సినిమా పరంగా ఆయన ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా, ఇతర పాత్రలలో ఆయన చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. 1959 ఆగష్టు 28న మద్రాసులో జన్మించిన సుమన్ నటన మాత్రమే కాకుండా కరాటేలో కూడా ఉత్తీర్ణత సాధించారు.
కరాటే మాస్టర్ గా కొన్ని రోజులు పని చేసిన తర్వాత ఆయన ను కుటుంబ స్నేహితుడు కిట్టు ఒక తమిళ నిర్మాతకు పరిచయం కావడం ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. 1977 లో నటించిన తమిళ సినిమా నీచల్ కులం తో సినీ రంగంలోకి అడుగుపెట్టి ఆ తర్వాత వరుస సినిమాలు చేసుకుంటూ స్టార్ గా ఎదిగిన సుమన్… తొలి సినిమాలో పోలీసు అధికారి పాత్రలో నటించి మెప్పించాడు. అన్ని భాషలలో కలిపి ఆయన దాదాపు 150కి పైగా చిత్రాలలో నటించారు. ఒకానొక సమయంలో నెంబర్ వన్ పీఠం కోసం చిరంజీవి తో పోటీ పడ్డాడు సుమన్. ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాల తో సుమన్ కెరీర్ చతికిలపడింది.
అనుకోని పరిస్థితులలో జైలుకి వెళ్లిన సుమన క జైలు జీవితం గడిపిన తర్వాత శిరీష అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. ఇక ఈమె ఎవరో కాదు తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రముఖ రైటర్ గా పేరు పొందిన నరసరావు మనవరాలు.. శిరీష హీరోయిన్లకు మించిన అందంతో ఉంటుంది.. ప్రస్తుతం సుమన్ వివాహ సమయంలో సంబంధించి కొన్ని ఫోటోలు తెగ వైరల్ గా మారగా, ఈ పిక్స్ చూస్తూ ఆమె అందం ఏంటొ అర్ధం అవుతుంది. సోషల్ మీడియాలో వీరి పెళ్లి కి సంబంధించిన కొన్ని ఫోటోలు వైరల్ గా మారాయి.