Dimple Hayathi : మాస్ మహారాజ రవితేజ హీరోగా, డింపుల్ హయతి, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా వచ్చిన చిత్రం.. ఖిలాడి. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌నే సాధించింది. ఈ క్రమంలోనే ప్రేక్షకులు రవితేజ పెర్ఫార్మెన్స్‌కు మరోమారు కితాబిచ్చారు. అయితే ఈ మూవీలో నటించిన డింపుల్ హయతి ఇందులో ఒక రేంజ్‌లో అందాల ప్రదర్శన చేసింది. గతంలో తెలుగు సినిమాల్లో ఏ హీరోయిన్ చేయనంతగా ఈమె గ్లామరస్ షో చేసింది.
ఇక ఇటీవల ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా నిర్వహించిన ప్రెస్ మీట్‌కు కూడా డింపుల్ హయతి గ్లామర్ డ్రెస్‌ను వేసుకుని వచ్చింది. అందులో ఆమె ఎద అందాలను ఒక రేంజ్‌లో ప్రదర్శించింది. దీంతో ఆమె స్కిన్ షో చూసి అందరూ అవాక్కయ్యారు. ఒక మూవీ ప్రెస్ మీట్ కోసమే ఇంతలా గ్లామర్‌ను ఒలకబోస్తూ డ్రెస్ ను ధరించి రావాలా.. అని అందరూ షాకయ్యారు. అయితే డింపుల్ హయతి నార్త్ భామ అని, అందుకనే అంతలా అందాలను ఆరబోసిందని అందరూ అనుకున్నారు. కానీ వాస్తవానికి ఆమె తెలుగు పిల్లనే. అవును నిజమే. ఆమెది విజయవాడనట.
ఇక డింపుల్ హయతి గతంలో గద్దలకొండ గణేష్ సినిమాలో ఐటమ్ సాంగ్ చేసింది. దీంతో ఆమెకు ఐటమ్ సాంగ్స్ కోసం పలు ఆఫర్లు కూడా వచ్చాయట. కానీ తాను హీరోయిన్ కావాలని చెప్పి ఆమె ఆ ఆఫర్లను సైతం వదులుకున్నదట. అందుకనే ఇంతకాలం వేచి చూసింది. దీంతో ఆమెకు ఎట్టకేలకు ఖిలాడి రూపంలో అవకాశం వచ్చింది. ఈ క్రమంలోనే ఈ మూవీలో ఈ భామ ఒక రేంజ్ లో అందాలను ఆరబోసింది. దీంతో ఆమెకు త్వరలో గోపీచంద్ పక్కన నటించే చాన్స్ వచ్చిందని తెలుస్తోంది. దీనిపై అధికారిక వివరాలను ప్రకటించాల్సి ఉంది.
కాగా డింపుల్ హయతి తెలుగు అమ్మాయి అయి ఉండి ఇంతలా గ్లామర్ షో చేయడంతో ఈ విషయం కూడా అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. గతంలో ఈమె పలు తమిళ, హిందీ సినిమాల్లో నటించింది. అయితే ఈమె కెరీర్ ఇప్పుడు ఎలా మలుపు తిరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.