Travel : చాలా మంది, వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. జ్యోతిష్య నిపుణులు చెప్పినట్లు ఆచరిస్తూ ఉంటారు. ప్రయాణం చేసే వాళ్ళు, కచ్చితంగా ఇలా చేయడం మంచిది. వీటిని పాటిస్తే కచ్చితంగా మంచి జరుగుతుంది. కొన్ని నక్షత్రాల వాళ్ళకి, తూర్పు వైపు శూల ఉంటుంది. వారి ఆయా నక్షత్రాలు సమయంలో, తూర్పుదిక్కుకి వెళ్ళకూడదు. అలానే తూర్పుదిక్కుకి ఏ వారం శూల ఉంటుందో, ఆ వారం అటువైపు వెళ్ళకూడదు అని జ్యోతిష్య నిపుణులు చెప్పడం జరిగింది.
తూర్పుదిక్కుకి ఒక లగ్నంలో శూల ఉంటుంది. ఆ లగ్నంలో ఆ దిక్కుకి ప్రయాణాన్ని చేయకూడదు. తిధి, వారం, నక్షత్రం, లగ్నంలో శూలలేని సమయం చూసుకుని ప్రయాణం చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. అలానే దీని కంటే దగ్ధయుగం ఎక్కువ ప్రభావితమైంది. కనుక ఆ టైంలో ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. పెళ్లిళ్లు, ఆరోగ్యం, విద్య, వ్యాపార సంబంధిత పనులు ఇతర ముఖ్యమైన పనుల కోసం వెళ్లేటప్పుడు వీటిని పాటించాలని శాస్త్రాలు చెప్పడం జరిగింది.
ఏదైనా అనుకోని పని గురించి, తప్పకుండా వెళ్లాల్సిన పరిస్థితి వస్తే, నిర్ధ్యం పెట్టడం మంచిదని పెద్దలు అంటుంటారు. తూర్పు వైపు వెళ్లాల్సిన అవసరం వచ్చినప్పుడు, ఆ సమయం మంచిది కానప్పుడు, దానికి ముందుగా వచ్చిన మంచి ముహూర్తంలో, ఏదైనా వస్తువుని అది కూడా పెడతారు. ఇలా చేయడం మంచిదట.
వెళ్లాల్సిన సమయంలో ఇంట్లో నుండి బయలుదేరి, ముందుగా ఆ దిక్కులో ఉంచిన వస్తువుల్ని వెంట తీసుకుని వెళ్లాల్సి ఉంది. ఇంటి నుండి బయలుదేరేటప్పుడు, ఏదైనా దైవ నామస్మరణ, మంత్ర పఠనం చేస్తే చాలా మంచి జరుగుతుంది. శుభం కలుగుతుంది. సుదూర ప్రయాణాలు చేయాల్సినప్పుడు సోమవారం, బుధవారం, గురువారం, శుక్రవారం మంచిది. విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి శుభ తిధులు.