Gongura Karam Podi : ఎంతో రుచిగా ఉండే గోంగూర కారం పొడి.. అన్నం మొద‌టి ముద్ద‌లో తినాలి..!

Gongura Karam Podi : మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల ఆకుకూర‌ల్లో గోంగూర ఒక‌టి. ఇందులో అనేక పోష‌కాలు ఉంటాయి. ముఖ్యంగా ఇందులో ఉండే ఐర‌న్ మ‌న‌లో ర‌క్త‌హీన‌త స‌మ‌స్య‌ను త‌గ్గిస్తుంది. ర‌క్తం బాగా త‌యార‌య్యేలా చేస్తుంది. అలాగే ఈ ఆకుకూర‌లోని కాల్షియం ఎముక‌ల‌ను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇంకా గోంగూర వ‌ల్ల మ‌న‌కు ఎన్నో ప్ర‌యోజనాలు క‌లుగుతాయి. అయితే సాధార‌ణంగా గోంగూర‌ను చాలా మంది ప‌ప్పు లేదా ప‌చ్చడి రూపంలో తింటుంటారు. ఇవి 1 లేదా 2 రోజుల‌కు మించి ఉండ‌వు. కానీ గోంగూర‌తో కారం పొడిని త‌యారు చేస్తే ఎక్కువ రోజుల పాలు నిల్వ ఉంటుంది. దీంతో ఎప్పుడు కావాలంటే అప్పుడు గోంగూర రుచిని ఆస్వాదించ‌వ‌చ్చు. అలాగే గోంగూర‌తో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ఇక గోంగూర కారం పొడిని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Gongura Karam Podi is very tasty eat in first with rice
Gongura Karam Podi

గోంగూర కారం పొడి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

గోంగూర ఆకులు – 4 క‌ప్పులు, ఆవాలు, జీల‌క‌ర్ర‌, ధ‌నియాలు – పావు క‌ప్పు చొప్పున‌, వెల్లుల్లి – నాలుగు, ఎండు మిర్చి – 12, మిన‌ప ప‌ప్పు – అర క‌ప్పు, ఉప్పు – రుచికి స‌రిప‌డా, శ‌న‌గ ప‌ప్పు – అర కప్పు, మెంతులు – ఒక టీస్పూన్‌, నూనె – రెండు టీస్పూన్లు.

గోంగూర కారం పొడి త‌యారు చేసే విధానం..

బాణ‌లిలో ఆవాలు, జీల‌క‌ర్ర‌, ధ‌నియాలు, మెంతులు వేసి వేయించి ప‌క్క‌న పెట్టాలి. త‌రువాత అందులోనే శ‌న‌గ‌ప‌ప్పు, మిన‌ప ప‌ప్పు, వెల్లుల్లి రెబ్బ‌లు, ఎండు మిర్చి కూడా వేసి వేయించి ప‌క్క‌న పెట్టుకోవాలి. ఇప్పుడు బాణ‌లిలో నూనె వేసి గోంగూర ఆకులు వేసి సిమ్‌లో వేయించాలి. త‌రువాత మిక్సీలో ఆవాలు, జీల‌క‌ర్ర‌, ధ‌నియాలు, మెంతులు వేసి ఒక‌సారి తిప్పాలి. త‌రువాత శ‌నగ ప‌ప్పు, మిన‌ప ప‌ప్పు, వెల్లుల్లి, ఉప్పు, ఎండు మిర్చి వేసి క‌చ్చాప‌చ్చాగా తిప్పాలి. చివ‌ర‌గా వేయించిన గోంగూర ఆకులు వేసి మ‌రోసారి మిక్సీ ప‌ట్టాలి. దీంతో గోంగూర కారం పొడి రెడీ అవుతుంది. ఇది అన్నంలో లేదా ఇడ్లీలు, దోశ‌ల వంటి వాటిలో చాలా బాగుంటుంది. అన్నం మొద‌టి ముద్ద‌లో దీన్ని తింటే ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి.

Editor

Recent Posts