Gutti Vankaya Vepudu : వంకాయలను కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాము వంకాయలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇతర కూరగాయల వలె వీటిని కూడా తప్పకుండా ఆహారంలో భాగంగా తీసుకోవాలి. వంకాయల్లోచాలా రకాలు ఉంటాయి. వాటిలో గుత్తి వంకాయ కూడా ఒకటి. గుత్తి వంకాయలతో మనం ఎక్కువగా మసాలా కూరను తయారు చేస్తూ ఉంటాము. ఈ కూరను అందరూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే గుత్తి వంకాయలతో మసాలా కూరలే కాకుండా మనం ఎంతో రుచిగా ఉండే వేపుడును కూడా తయారు చేసుకోవచ్చు. గుత్తి వంకాయలతో చేసే ఈ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం చాలా తేలిక. ఆంధ్రా స్టైల్ లో గుత్తి వంకాయ వేపుడును ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
గుత్తి వంకాయ వేపుడు తయారీకి కావల్సిన పదార్థాలు..
గుత్తి వంకాయలు – పావుకిలో, తరిగిన ఉల్లిపాయలు – 2, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, తరిగిన టమాట – 1, ఉప్పు – తగినంత, కారం – ఒక టీ స్పూన్, ధనియాల పొడి -ఒక టీ స్పూన్, , పసుపు – అర టీ స్పూన్, గరం మసాలా – ఒక టీ స్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్స్.
గుత్తి వంకాయ వేపుడు తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో వంకాయల తొడిమెలను కట్ చేసి నాలుగు ముక్కలుగా కట్ చేసుకుని ఉప్పు నీటిలో వేసుకోవాలి. తరువాత జార్ లో నూనె,కొత్తిమీర తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత ఈ పేస్ట్ ను వంకాయల్లో స్టఫ్ చేసుకోవాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక వంకాయలను వేసుకోవాలి.
తరువాత మిగిలిన మసాలా పేస్ట్ లో కొద్దిగా పేస్ట్ వేసి కళాయిలో వేసుకోవాలి. తరువాత వీటిపై మూత పెట్టి 15 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత ఈవంకాయలను నెమ్మదిగా కదపాలి. దీనిని నీరంతా ఇగిరి పోయి కూర దగ్గర పడే వరకు ఉడికించాలి. ఇలా ఉడికించిన తరువాత కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే గుత్తి వంకాయ వేపుడు తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా చేసిన గుత్తి వంకాయ వేపుడును అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.