Rudraksha Mala : శివారాధాన చేసేటప్పుడు చేతిలో రుద్రాక్షను ధరించి పూజలు చేసినా, జపం చేసినా మంచి ఫలితాలు కలుగుతాయి. ఆ సమయంలో మంత్రాలు ఉచ్చరిస్తే ఇంకా ఎక్కువ ఫలితం ఉంటుంది. అయితే పూజ చేసే సమయంలో చేతిలో ధరించే రుద్రాక్షలో సహజంగా 108 రుద్రాక్షలు ఉంటాయి. ఆ మాలతోనే ఎక్కువ ఫలితం ఉంటుందని అందరూ నమ్ముతారు. కానీ 108 కాకుండా కింద సూచించిన విధంగా పలు విభిన్నమైన సంఖ్యల్లో రుద్రాక్షలు ఉన్న మాలలతో కూడా పూజలు చేయవచ్చు. ఒక్కో రకమైన రుద్రాక్ష మాలకు భిన్నమైన ఫలితాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
27 రుద్రాక్షలు..
27 రుద్రాక్షలు కలిగిన మాలతో పూజిస్తే మంచి ఆరోగ్యం కలుగుతుంది. పనిచేసే సామర్థ్యం పెరుగుతుంది. ఎల్లప్పుడూ అమితమైన శక్తి కలిగి ఉంటారు. చాలా దృఢంగా ఉంటారు. ఏ పని చేసినా అలసిపోరు.
30 రుద్రాక్షలు..
30 రుద్రాక్షలు కలిగిన మాలతో పూజిస్తే ధనం, సంతోషం కలుగుతాయి. ఆర్థిక సమస్యలు పోతాయి. బాగా నష్టపోయిన వారు, ఆర్థిక స్థితి బాగా లేని వారు ఈ మాలతో పూజలు చేస్తే ఫలితం ఉంటుంది.
54 రుద్రాక్షలు..
54 రుద్రాక్షలు ఉన్న మాలతో పూజలు చేస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది. మనస్థైర్యం పెరుగుతుంది. మనస్సుపై నియంత్రణ వస్తుంది. చెడు ఆలోచనలు రావు. ఒత్తిడి, ఆందోళనల నుంచి బయట పడవచ్చు. ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనే మానసిక శక్తి లభిస్తుంది.
108 రుద్రాక్షలు..
108 రుద్రాక్షలు ఉన్న మాలతో పూజలు చేస్తే అనుకున్న పనులు నెరవేరుతాయి. ఏ పని తలపెట్టినా విజయం కలుగుతుంది. పనులు సకాలంలో పూర్తవుతాయి. ఎలాంటి ఇబ్బందులు రావు.