ఈ రోజుల్లో చాలా మంది బయటి ప్రాంతాలకి వెళ్లినప్పుడు అక్కడి మందు తెచ్చుకునేందుకు ఇష్టపడుతున్నారు. కొన్ని రాష్ట్రాలలో మద్యం ధరలు ఎక్కువగా, మరి కొన్ని రాష్ట్రాలలో తక్కువగా ఉంటున్నాయి. అందుకే తక్కువ ఉన్న చోట మద్యం తెచ్చుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. కొందరు తమ కార్లలో, మరి కొందరు ఫ్లైట్స్‌లో, ఇంకొందరు ట్రైన్ లేదా బస్సులలో మద్యం తీసుకెళుతుంటారు. అయితే బస్సులో మద్యం తీసుకెళ్లడానికి అనుమతి ఉందా లేదా అనే ప్రశ్న కూడా ప్రజల మదిలో మెదులుతోంది. అయితే, బస్సులో ఎన్ని మద్యం బాటిళ్లను తీసుకెళ్లవచ్చు? దీనికి నియమాలు ఏమిటి? ఇప్పుడు చూద్దాం.
భారతదేశంలో, ప్రయాణ సమయంలో మద్యం తీసుకెళ్లడానికి నియమాలు రూపొందించబడ్డాయి.ఎవరైనా నిబంధనలు పాటించి మద్యం తీసుకెళ్లినట్లయితే, ఎలాంటి సమస్య ఉండదు. కానీ మద్యం నిషేధించబడని రాష్ట్రాల్లో మాత్రమే మీరు మద్యంను తీసుకెళ్లవచ్చు. భారతదేశంలో మద్యం సేవించడం మరియు అమ్మడం రెండూ నిషేధించబడిన అనేక రాష్ట్రాలు ఉన్నాయి.ఇది కాకుండా, మద్యం నిషేధించబడని రాష్ట్రాల్లో, మీరు రెండు లీటర్ల వరకు మద్యం తీసుకెళ్లవచ్చు. అయితే ఇంతకు మించి తీసుకెళ్తే రూ. 5000 జరిమానా.. దానితో పాటు 5 ఏళ్ల జైలు శిక్ష కూడా విధించవచ్చు. తక్కువ ధరకు మద్యం కొని ఒక చోట నుంచి మరో చోటికి తీసుకెళ్లడం కొందరు చేస్తుంటారు
అయితే బస్సు డ్రైవర్ లేదా కండక్టర్ మిమ్మల్ని అనుమతించినప్పుడు మాత్రమే మీరు బస్సులో మద్యం తీసుకెళ్లవచ్చు. బస్సు ఆపరేటర్ తన బస్సులో మద్యం తీసుకెళ్లకూడదని నిబంధన విధించినట్లయితే, మీరు బస్సులో మద్యం తీసుకెళ్లలేరు. దీనితో పాటు, మీరు బస్సులో మద్యం తీసుకెళ్లాలనుకుంటే, మీ వద్ద బిల్లు ఉండాలి. అంటే మీరు కొనుగోలు చేసిన మద్యం బాటిల్‌కు సంబంధించిన రుజువు చూపాలి. లేకపోతే, మీకు జరిమానా విధించవచ్చు. సాధారణంగా గోవా నుండి కూడా చాలా మంది మద్యం తెచ్చుకునేందుకు ఆసక్తి చూపుతుంటారు. కాకపోతే కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.