Naivedyam : హిందూ మతంలో భగవంతుని రోజు వారి ఆరాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. నిత్యం పూజలు చేయడం వల్ల ఎంతో మేలు కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. అయితే నియమానుసారంగా పూజలు చేసినప్పుడు మాత్రమే భగవంతుని అనుగ్రహం సానుకూలత లభిస్తాయి. మంత్రోచ్ఛారణ పఠనం మొదలు కొని నైవేద్య సమర్పణ వరకు అన్ని సరిగ్గా చేస్తేనే మనం భగవంతుని కృపను సొంతం చేసుకోగలుగుతాము. అలాగే భగవంతుడికి నైవేద్యాన్ని సరిగ్గా సమర్పిస్తేనే భగవంతుడు సంతోషిస్తాడు. అయితే మనలో చాలా మందికి భగవంతుడికి నైవేద్యం సమర్పించే విషయంలో అనేక అనుమానాలు ఉన్నాయి. కనుక ఈ రోజు మనం భగవంతుడికి నైవేద్యాన్ని సమర్పించే సమయంలో పాటించాల్సిన నియమాల గురించి తెలుసుకుందాం.
భగవంతుడికి నైవేద్యాన్ని పెట్టే సమయంలో నైవేద్య మంత్రం పఠించడం చాలా అవసరం. ఈ మంత్రం పఠించిన తరువాతే భగవంతుడు నైవేద్యాన్ని స్వీకరిస్తాడని నమ్ముతారు. అలాగే బగవంతుడి ముందు నైవేద్యాన్ని ఎత సమయం ఉంచుతున్నామో చూసుకోవడం కూడా చాలా ముఖ్యం. నైవేద్యాన్ని వెంటనే తీసివేయకూడదు. అలాగే ఎక్కువ సమయం పూజ గదిలో ఉంచకూడదు. నైవేద్యాన్ని సమర్పించిన తరువాత 5 నిమిషాల పాటు ఉంచడం మంచిది. 5 నిమిషాల తరువాత నైవేద్యాన్ని తీసుకుని అందరికి ప్రసాతదంగా పంచి పెట్టాలి. అలాగే నైవేద్యాన్ని ఏ పాత్రలో సమర్పిస్తున్నామో చూసుకోవడం కూడా ముఖ్యం. బంగారం, వెండి, రాగి, ఇత్తడి, మట్టి పాత్రలో మాత్రమే నైవుద్యాన్ని సమర్పించాలి. పాత్ర యొక్క లోహం స్వచ్చంగా ఉండాలి.
అల్యూమినియం, ఇనుము, ఉక్కు, ప్లాస్టిక్, గాజు పాత్రలల్లో నైవేద్యాన్ని సమర్పించడం మంచిది కాదు. అలాగే భగవంతుడికి సమర్పించిన నైవేద్యాన్ని ఎక్కువ మందికి పంచి పెట్టడం మంచిది. అలాగే నైవేద్యాన్ని తయారు చేసేటప్పుడు శుభ్రంగా, సాత్వికంగా తయారు చేయాలని గుర్తించుకోవాలి. ఇలా తగిన నియమాలు పాటిస్తూ నైవేద్యాన్ని సమర్పించడం వల్ల భగవంతుడు మన కోరికలన్నింటిని తప్పకుండా తీరుస్తాడు. భగవంతుడి కృప మనపై ఎల్లప్పుడూ ఉంటుంది.