Ram Charan : ఎవరు ఎవరికి రాసిపెట్టి ఉంటారో ఎవరూ చెప్పలేరు. పెళ్లిళ్లు అనేవి స్వర్గంలో నిర్ణయించబడతాయి అని పెద్దలు చెబుతూ ఉంటారు. ఒక జంట భార్యాభర్తలు కావాలి అని రాసిపెట్టి ఉంటే ఆ విధిని దేవుడు కూడా మార్చలేడు. ఈ విధంగానే 2012 జూన్ 14న ఒక జంట మూడు ముళ్ళ బంధంతో ఒక్కటయ్యారు. వారు ఇంకెవరో కాదు రామ్ చరణ్ మరియు ఉపాసన. మెగాస్టార్ సినీ వారసుడిగా చిరుత చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యారు రామ్ చరణ్. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర చిత్రంతో రామ్ చరణ్ ఫుల్ క్రేజ్ ని సంపాదించుకున్నాడు.
మగధీరతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్నాడు. 2012లో ప్రముఖ వ్యాపార వేత్త, అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి మనవరాలు ఉపాసనను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. పెళ్లి అయ్యి పది సంవత్సరాలు పూర్తయి ఎంతో అన్యోన్యంగా దాంపత్య జీవితాన్ని కొనసాగిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ వివాహం చేద్దామని నిర్ణయించుకున్న తర్వాత ఒక స్టార్ హీరో కూతురుని తన కోడలుగా చేసుకుందామని నిర్ణయించుకున్నారట. చిరంజీవి వియ్యంకుడిగా చేసుకుందామనుకున్న ఆ స్టార్ హీరో ఎవరో కాదు.. దగ్గుబాటి రామానాయుడు వారసుడు విక్టరీ వెంకటేష్.
వెంకటేష్ పెద్ద కుమార్తె ఆశ్రిత ను చరణ్ కిచ్చి వివాహం చేయాలని మెగాస్టార్ చిరంజీవి అనుకున్నారట. దాదాపు ఒకే జనరేషన్ కి చెందిన చిరంజీవి, వెంకటేష్ అగ్ర స్థాయి హీరోలుగా దశాబ్దాల పాటు టాలీవుడ్ లో తమ హవా కొనసాగించారు. వీరిద్దరి మధ్య మంచి స్నేహబంధం కూడా ఉంది. ఇక అప్పట్లో రామ్ చరణ్, ఆశ్రితలకు వివాహం చేయాలని చిరంజీవి, వెంకటేష్ మధ్య మాటలు జరిగాయట. దాదాపు సంబంధం ఖాయం అయ్యింది అనే ఈ సమయంలో రామ్ చరణ్ అభిప్రాయం తెలుసుకుందామని చిరంజీవి అడగ్గా నో చెప్పారట. ఇక రామ్ చరణ్ ఉపాసనను ప్రేమిస్తున్నట్లు, పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లు తన అభిప్రాయాన్ని చిరంజీవితో చెప్పాడట.
రామ్ చరణ్ ఉపాసనతో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడని తెలుసుకొని వెంకటేష్ కుటుంబంతో సంబంధం క్యాన్సిల్ చేసుకున్నారట చిరంజీవి. మెగాస్టార్ కూడా రామ్ చరణ్ ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో 2012 జూన్ 14 న అంగరంగ వైభవంగా ఎంతో మంది ప్రముఖులు ముందు రామ్ చరణ్, ఉపాసన జంట మూడుముళ్ల బంధంతో ఒకటి అయ్యింది.