ఎంతో రుచికరమైన బనానా డోనట్స్ అంటే అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. అయితే పేరు వినడానికి కష్టంగా ఉన్నా ఈ రెసిపీ చేయడం ఎంతో సులువు,అదేవిధంగా తినడానికి కూడా ఎంతో రుచికరంగా ఉంటుంది. మరి తియ్యగా ఉండే ఈ బనానా డోనట్స్ ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు
అరటి పండ్లు 2 పండినవి, గోధుమపిండి ఒకటిన్నర కప్పు, చక్కెర అరకప్పు, ఉప్పు చిటికెడు, కోడిగుడ్లు రెండు, బేకింగ్ సోడా తగినంత, వెనీలా ఎక్స్ ట్రాక్ట్ ఒక టీ స్పూన్, బటర్ పావు కప్పు (కరిగినది).
తయారీ విధానం
ముందుగా ఒక గిన్నెలోకి అరటి పండ్లను మెత్తని గుజ్జులా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ గిన్నెలోకి పంచదార, ఉప్పు, వెనీలా ఎక్స్ ట్రాక్ట్ వేసి బాగా కలియబెట్టాలి. ఆ తరువాత బేకింగ్ పౌడర్ కరిగించిన బటర్ వేసుకొని కలిపి ఆ తరువాత గోధుమపిండి కొద్దికొద్దిగా వేసుకుంటూ ఎక్కడా ఉండలు లేకుండా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని డోనట్ మేకర్ లో పాన్ పెట్టి కొద్దిగా నూనె రాసి ముందుగా తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా అందులో వేసి స్విచ్ ఆన్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బనానా డోనట్స్ తయారయినట్టే.