Asking For Food : ఒక్కోసారి మన ఇంటికి ఎవరైనా వచ్చి అన్నం పెట్టమని అడుగుతూ ఉంటారు. నిజానికి ఎవరైనా వచ్చి అన్నం పెట్టమని అడిగారంటే అది అదృష్టం అని చెప్పొచ్చు. అంటే పుణ్యకాలం ప్రవేశిస్తుందని దానికి అర్థం. భగవంతుడు ఎవర్నో అడ్డం పెట్టుకొని వాళ్ళ ద్వారా మీకు పుణ్య ఫలితాన్ని అందిస్తున్నట్లు అర్థం చేసుకోవాలి. సరిగ్గా దానిని వినియోగించుకోవాలి. ఇలా భోజనం పెట్టడం ఎంతో పుణ్యం.
అయితే సాధారణంగా మనం అన్నం అడగకుండా పెట్టడం కంటే మీ ముందుకు వచ్చి అన్నం పెట్టు అమ్మ అని చెప్పి చేయి చాచితే అంతకంటే పుణ్యం ఇంకొకటి ఏమీ లేదట. అదే గోమాత ఇంటికి వచ్చిందంటే కచ్చితంగా ఏదో ఒకటి పెట్టాలి. గ్రాసం కానీ అన్నం కానీ ఏదో ఒకటి పెట్టాలి.
అడగకపోయినా ఒక వ్యక్తికి కచ్చితంగా భోజనం పెట్టాలి. అలా చేయడం వలన కోట్ల జన్మల పాపం పోతుంది. అతనికి ఆతిథ్యం ఇస్తే చక్కటి పుణ్యం కలుగుతుంది. ఏమీ పెట్ట లేకపోతే కనీసం తీర్థం ఇచ్చినా కూడా పుణ్యమే. ఆ సమయం మళ్లీ తిరిగి రాదు. అటువంటి సమయాన్ని కచ్చితంగా మీరు వినియోగించుకోవాలి. ఇంటి ముందుకు వచ్చిన గోమాతకి కూడా అంతే.
గోమాతకి ఆహారం పెట్టడం వలన పాపాలన్నీ పోతాయి. ఎంతో పుణ్యం వస్తుంది. ఒకవేళ మీ దగ్గర పెట్టడానికి ఏమీ లేకపోయినా ఉన్న దాంట్లో కొంచెం అయినా పెట్టండి. తిండి దొరకక మన ఇంటికి ఎవరూ రారు. కాబట్టి అన్నం పెట్టమని అడిగిన వాళ్ళకి కచ్చితంగా పెట్టాలి. అలాగే గోమాతని ఖాళీ కడుపుతో పంపించకూడదు. గోమాతకి ఆహారం పెట్టడం వలన శుభ ఫలితం కనబడుతుంది. నల్లని గోవుకి, నల్లని కుక్కకి అన్నం పెడితే అపమృత్యు దోషం తొలగిపోతుంది. అన్నంలో కొంచెం బెల్లాన్ని కలిపి పెడితే ఇంకా మంచిది.