Dreams : పగలైనా, రాత్రయినా నిద్ర పోయామంటే చాలు మనకు ఎవరికైనా కలలు వస్తాయి. కొన్ని నిత్యం మనం చేసే పనులకు సంబంధించిన కలలు వస్తే కొన్ని ఎప్పుడో జరిగిన సంఘటనల తాలూకు కలలు అయి ఉంటాయి. కొందరికైతే యాదృచ్చికంగానే వచ్చే కొన్ని కలలు భవిష్యత్తులో నిజమవుతూ ఉంటాయి. అయితే కలల్లో చాలా రకాలు ఉంటాయి. కొన్ని మనకు ఆందోళన కలిగిస్తే కొన్ని భయాన్ని, కొన్ని సంతోషాన్ని కలిగిస్తాయి. కానీ మీకు తెలుసా..? కొన్ని రకాల కలలు వస్తే త్వరలో మనం ధనవంతులం అవుతామని తెలుసుకోవాలి. ఆ కలలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
కలలో సూర్యుడు కనిపించాడంటే త్వరలోనే మీకు కొంత ధనం రాబోతుందని సంకేతం. అంతేకాదు చాలా ప్రకాశవంతంగా సూర్యుడు కనిపిస్తే మాత్రం త్వరలోనే మీ జీవితం అత్యంత డబ్బుతో నిండిపోతుంది. అంటే ధనవంతులు అవుతారని సంకేతం. కలలో సూర్యుడి లాగే చంద్రుడు కనిపించినా త్వరలోనే ధనవంతులు అవుతారని అర్థం చేసుకోవాలి. చంద్రుడు అంటేనే ప్రశాంతతకు సంకేతం. కాబట్టి మీలో కోపం తగ్గుతుందని కూడా ఆ కల సూచిస్తుంది. నిజ జీవితంలో జుట్టు రాలిపోవడం పెద్ద సంగతేం కాదు. కలలో మాత్రం మీ జుట్టు రాలుతున్నట్టు చూశారంటే త్వరలోనే లక్ష్మీదేవి అనుగ్రహం, ఆశీర్వాదం పొందుతారని సంకేతం. భవిష్యత్తులో ధనవంతులు కానున్నారనే దానికి సంకేతంగా ఈ కల వస్తుంది.
ఏ పని ఉన్నా మనం బయటికి వెళ్లేందుకు రెడీ అవుతుంటాం. అయితే ఇలా గనక ఎవరికైనా కల వస్తే వారు త్వరలో ధనవంతులు అవుతారని అర్థం చేసుకోవాలి. వీరికి ధనం బాగా వస్తుందని తెలుసుకోవాలి. డబ్బులు, కార్డులు, ఇతర వస్తువులు ఉంచుకునే పర్సు కలలో కనిపించినా ధనవంతులు అవుతారని అర్థం. వీరికి ధనం వస్తుందని తెలుసుకోవాలి. ఆవును హిందువులు దేవతగా భావిస్తారు. అయితే అలాంటి ఆవు కనిపించినా, లేదంటే ఆవు పాలిస్తున్నట్టు కలలో చూసినా వారు త్వరలోనే మిక్కిలి ధనవంతులు అవుతారని అర్థం చేసుకోవాలి.
బంగారం అంటేనే హిందువులు లక్ష్మీ దేవిగా భావిస్తారు. అలాంటి బంగారం కలలో కనిపించినా వారు త్వరలో ధనవంతులు అవుతారని తెలుసుకోవాలి. కలలో అద్దాలు కనిపించినా ధనవంతులు అవుతారని తెలుసుకోవాలి. వీరికి కూడా ధనం బాగా వస్తుందట. అయితే పగిలిన అద్దాలు మాత్రం కనిపించరాదు. తియ్యని రుచితో ఉండే పాయసం కలలో కనిపించినా వారు ధనవంతులు అవుతారట. ఇలాంటి వారికి ధనం త్వరగా లభిస్తుందట. ధనవంతులు అవుతారట.