ఈ రోజుల్లో హ్యాకర్లకు స్మార్ట్ ఫోన్ ను హ్యాక్ చేయడం ఎంతో సులువైన పని. అయితే మీ ఫోన్ హ్యాక్ అయిందో లేదో ఈ విధంగా కనిపెట్టవచ్చు. ఒకవేళ మీ ఫోన్ బ్యాటరీ త్వరగా అయిపోతున్నట్టు అయితే హ్యాకర్లు మీ ఫోన్ కంట్రోల్ ను తీసుకున్నట్టే మరియు మీ ఫోన్ లో ఉండే ఎలాంటి అప్లికేషన్ అయినా సమాచారాన్ని ఇస్తున్నట్టే. మీ ఫోన్ కనుక త్వరగా వేడిగా అవ్వడం లేక అనవసరమైన అప్లికేషన్ రన్ అవుతుంటే ఈ విధంగా జరుగుతుంది.
ఒకవేళ మీ సోషల్ మీడియా ఎకౌంట్ ఫేస్బుక్ , ఇన్స్టాగ్రామ్ వంటి వాటి నుండి ఎలాంటి పోస్ట్ అయినా మీకు తెలియకుండా చేసినట్లయితే మీ ఫోన్ ను లేక సోషల్ మీడియా ఎకౌంట్ ను హ్యాకర్లు హ్యాక్ చేసినట్టే. స్మార్ట్ ఫోన్స్ స్లో అయితే కనుక మీరు ఎంతో జాగ్రత్త పడాలి.
అనవసరమైన అప్లికేషన్స్ లేక మాల్వేర్స్ ను మీ ఫోన్ లో ఇన్స్టాల్ చేసి ఉంటే ఈ విధంగా జరుగుతుంది. దీంతో పాటుగా మీ ఫోన్ లో ఉండే అప్లికేషన్స్ కూడా క్రాష్ అవుతూ ఉంటాయి. ఇలా జరిగితే హ్యాక్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అని గమనించాలి.