India Vs Sri Lanka : సాధారణంగా క్రికెట్‌లో ఒక బ్యాట్స్‌మన్ ఒక బౌలర్ దెబ్బకు బెంబేలెత్తిపోవడం మామూలే. ఒక బౌలర్ ఒక బ్యాట్స్‌మన్‌ను పదే పదే ఔట్ చేసిన సందర్భాలు చాలానే ఉంటాయి. టీ20, వన్డే, టెస్టు.. ఫార్మాట్ ఏదైనా సరే బౌలర్లు కొన్ని సందర్భాల్లో కొందరు బ్యాట్స్‌మెన్‌ను పదే పదే సిరీస్‌లలో ఔట్ చేస్తుంటారు. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితి రోహిత్ శర్మకు ఎదురవుతుందని చెప్పవచ్చు. శ్రీలంక బౌలర్ దుష్మంత చమీర దెబ్బకు రోహిత్ వరుసగా ఫెయిల్ అవుతూనే ఉన్నాడు. దీంతో నెటిజన్లు రోహిత్ శర్మను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.
ఈ మధ్యే ముగిసిన టీ20 సిరీస్‌లో శ్రీలంక బౌలర్ దుష్మంత చమీర భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మను పదే పదే ఔట్ చేశాడు. రెండో టీ20లో రోహిత్ శర్మ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేయగా.. చమీర బౌలింగ్ లో ఔటయ్యాడు. అలాగే మూడో టీ20 మ్యాచ్‌లో రోహిత్ 9 బంతులు ఆడి 5 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. దీంతో రోహిత్‌ను కొందరు టార్గెట్ చేసి విమర్శిస్తున్నారు. అయితే ఇప్పుడు చమీర రెండో టెస్టులో ఆడేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో నెటిజన్లు రోహిత్‌ను మళ్లీ విమర్శిస్తున్నారు.
శ్రీలంక బౌలర్ లాహిరు కుమార మొదటి టెస్టులో గాయపడగా.. అతని స్థానంలో రెండో టెస్టు మ్యాచ్‌లో చమీర రానున్నట్లు తెలుస్తోంది. దీంతో చమీర మళ్లీ రోహిత్‌కు చుక్కలు చూపించడం ఖాయమని అంటున్నారు. రోహిత్ శర్మ కెప్టెన్‌గా సక్సెస్ అవుతున్నప్పటికీ బ్యాట్స్‌మెన్ గా మాత్రం విఫలమవుతూనే ఉన్నాడు. అది కూడా చమీర బౌలింగ్‌లో అతను ఔట్ అవుతుండడం వల్ల రోహిత్‌ను నెటిజన్లు విమర్శిస్తూ ట్రోల్ చేస్తున్నారు. మరి రెండో టెస్టులో ఏం జరుగుతుందో చూడాలి. రెండో టెస్టు మ్యాచ్ బెంగళూరులో శనివారం నుంచి ప్రారంభం కానుంది. డే నైట్ ఫార్మాట్ లో ఈ టెస్టును నిర్వహించనున్నారు. మొదటి టెస్టులో లంకపై భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో రెండో టెస్టులోనూ విజయం సాధించాలని భారత్ ఉవ్విళ్లూరుతోంది.