Infinix 32X3 : మొబైల్స్ తయారీ చేయడంలో పేరుగాంచిన ఇన్ఫినిక్స్ అనే సంస్థ తాజాగా టీవీల మార్కెట్‌లోకి ప్రవేశించింది. అందులో భాగంగానే ఎక్స్1 సిరీస్‌లో రెండు నూతన మోడల్ టీవీలను లాంచ్ చేసింది. 32ఎక్స్3, 43ఎక్స్3 పేరిట ఈ టీవీలు లాంచ్ అయ్యాయి. వీటిల్లో అద్భుతమైన ఫీచర్లను అందిస్తున్నారు. వీటి ధరలు కూడా తక్కువగానే ఉండడం విశేషం.
ఇన్పినిక్స్ 32ఎక్స్3, 43ఎక్స్3 టీవీలలో అద్భుతమైన ఫీచర్లను అందిస్తున్నారు. 32ఎక్స్3 మోడల్‌లో డిస్‌ప్లే సైజ్ 32 ఇంచులు ఉండగా.. 43ఎక్స్3 మోడల్‌లో టీవీ డిస్‌ప్లే సైజ్ 43 ఇంచులుగా ఉంది. ఇక వీటిల్లో హెచ్‌డీ, ఫుల్ హెచ్‌డీ రిజల్యూషన్‌లను అందిస్తున్నారు. అలాగే ఇన్ఫినిక్స్ ఎపిక్ 3.0 పిక్చర్ ఇంజిన్ టెక్నాలజీ ఉంది. కనుక ఈ టీవీల్లో దృశ్యాలు అద్భుతంగా కనిపిస్తాయి. అలాగే 1జీబీ ర్యామ్, 8జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్‌ను వీటిల్లో అందిస్తున్నారు. ఆండ్రాయిడ్ 11 ఓఎస్ ఆధారంగా ఇవి పనిచేస్తాయి.
ఈ టీవీల్లో బిల్టిన్ క్రోమ్‌క్యాస్ట్ ను అందిస్తున్నారు. అలాగే గూగుల్ అసిస్టెంట్, గూగుల్ ప్లే స్టోర్ ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటితోపాటు నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్, గూగుల్ ప్లే యాప్‌లను ఇన్‌బిల్ట్‌గా అందిస్తున్నారు. ఈ టీవీల్లో వైఫై, బ్లూటూత్ 5.0, డాల్బీ ఆడియో వంటి ఇతర ఫీచర్లు కూడా ఉన్నాయి.
ఇక ఇన్ఫినిక్స్ 32ఎక్స్3 టీవీ ధర రూ.11,999 ఉండగా, 43ఎక్స్3 టీవీ ధర రూ.19,999గా ఉంది. వీటిని మార్చి 16వ తేదీ నుంచి విక్రయించనున్నారు. ఈ టీవీలను కొన్నవారు రూ.1499 విలువైన ఐరాకర్ ఇయర్‌బడ్స్‌ను కేవలం రూ.1 చెల్లించి సొంతం చేసుకోవచ్చు.