Rice Vs Chapati : ఉదయం, మధ్యాహ్నం సహజంగానే చాలా మంది రకరకాల ఆహారాలను తింటుంటారు. కానీ రాత్రి భోజనం విషయానికి వచ్చేసరికి చాలా మందికి ఏం చేయాలో తెలియదు. అందుకని చపాతీలను తింటుంటారు. అదేమని అంటే.. చపాతీలను తింటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని, బరువు తగ్గుతారని.. షుగర్ ఉంటే కంట్రోల్ అవుతుందని చెబుతారు. అయితే వాస్తవానికి రాత్రి పూట అసలు వేటిని తింటే మంచిది ? అన్నం లేదా చపాతీలు.. వేటిని తినాలి ? వేటితో మనకు లాభాలు కలుగుతాయి ? దీనిపై పోషకాహార నిపుణులు ఏమంటున్నారు ? అంటే..
రాత్రి పూట అసలు అన్నం లేదా చపాతీ.. దేన్నీ తినకూడదు. ఎందుకంటే.. రెండింటిలోనూ పిండి పదార్థాలు ఉంటాయి. ఇవి మన శరీరానికి సరిపోగా మిగిలినవి కొవ్వు రూపంలో పేరుకుపోతాయి. కానీ అన్నం, చపాతీలు రెండూ మంచివి కావు. రెండింటినీ రాత్రి పూట తినరాదు. మరి రాత్రి పూట ఏ ఆహారాలను తినాలి ? అంటే..
సాయంత్రం సమయంలో ఉడకబెట్టిన పెసలు లేదా శనగలు లేదా నట్స్, పండ్లు తినాలి. ఇక రాత్రి పూట చిరుధాన్యాలను తీసుకోవాలి. అంటే.. రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు, అరికెలు, సామలు.. ఇవన్నమాట. వీటిని రాత్రి పూట ఉప్మా లేదా అన్నం లేదా గటక మాదిరిగా వండుకుని తినాలి. ఇవి ఎంతగానో మేలు చేస్తాయి. ముఖ్యంగా షుగర్ లెవల్స్ తగ్గుతాయి. బీపీ అదుపులోకి వస్తుంది. అధిక బరువు తగ్గుతారు. ఇంకా చిరు ధాన్యాలను రాత్రి పూట తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. కనుక రాత్రి పూట అన్నం, చపాతీలకు బదులుగా చిరు ధాన్యాలను తినాలి. ఇక రాత్రి పెరుగుకు బదులుగా మజ్జిగలో అల్లం రసం లేదా శొంఠి పొడి కలిపి తాగితే ఇంకా మేలు జరుగుతుంది. దీంతో అనేక ప్రయోజనాలను పొందవచ్చు. అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటారు.