IPL 2022 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 సీజన్ ప్రారంభానికి ఇంకా సరిగ్గా వారం రోజులే ఉంది. ఈ క్రమంలోనే వేసవిలో చల్లని వినోదాన్ని అందించేందుకు ఐపీఎల్ ఇప్పటికే సిద్ధమైంది. ఈ లీగ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ప్లేయర్లు కూడా ఇప్పటికే తమ తమ జట్టు శిబిరాల్లో చేరిపోయి ప్రాక్టీస్‌ను మొదలు పెట్టేశారు. కాగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు అభిషేక్ శర్మ మాత్రం సర్కారు వారి పాట కళావతి సాంగ్ మూడ్‌లో ఉన్నట్టున్నాడు. ఆ సాంగ్‌కు స్టెప్పులేసి అలరించాడు.
సర్కారు వారి పాట సినిమాలోని కళావతి సాంగ్ ఎంతగానో ఆకట్టుకుంటున్న విషయం విదితమే. ఇందులో మహేష్ బాబు వేసిన డ్యాన్స్ స్టెప్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక ఈ పాటకు ఇప్పటికే చాలా మంది డ్యాన్స్‌లు చేశారు. తాజాగా సన్ రైజర్స్ ప్లేయర్ అభిషేక శర్మ కూడా కళావతి పాటకు స్టెప్పులేసి అలరించాడు. ఈ క్రమంలోనే ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను సర్ రైజర్స్ జట్టు యాజమాన్యం తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది.
Sarkaru vaari paataki Abhishek vaari aata ????@IamAbhiSharma4 #OrangeArmy #ReadyToRise #TATAIPL pic.twitter.com/AE32pFTwPY
— SunRisers Hyderabad (@SunRisers) March 19, 2022
కాగా అభిషేక్ డ్యాన్స్‌పై నెటిజన్లు రకరకాల కామెంట్‌లు చేస్తున్నారు. ఓ యాజర్ స్పందిస్తూ.. మైకేల్ జాక్సన్ లా డ్యాన్స్ చేస్తున్నావు.. అంటూ కామెంట్ పోస్ట్ చేశాడు. కాగా ఇటీవలే జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో అభిషేక్ శర్మను రూ. 6.50 కోట్లకు సన్ రైజర్స్ జట్టు కొనుగోలు చేసింది. కాగా మార్చి 26 నుంచి ఐపీఎల్ 2022 ప్రారంభం అవుతోంది. ఈ క్రమంలోనే సన్‌రైజెర్స్ హైదరాబాద్ జట్టు తన తొలి మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ తో ఆడనుంది. ఈ మ్యాచ్ మార్చి 29వ తేదీన జరగనుంది. అయితే ఈ సారి హైదరాబాద్ జట్టులో అంత చెప్పుకోదగ్గ ప్లేయర్లు లేరని టాక్ వినిపిస్తోంది. మరి హైదరాబాద్ జట్టు ఈ సారి ఎలాంటి ప్రదర్శనను ఇస్తుందో చూడాలి.