Mahesh Babu : మహేశ్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం సర్కారు వారి పాట. యాక్షన్, కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్ టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. మే 12, 2022 న ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

కాగా ఈ సినిమాలోని కళావతి పాటను ఇప్పటికే విడుదల చేశారు. వంద మిలియన్ వ్యూస్‌తో ఈ పాట ట్రెండింగ్ లో ఉంది. ఈ సినిమాలోని సెకండ్ సాంగ్‌ను ఈ నెల 20వ తేదీన విడుదల చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. సెకండ్ సాంగ్ కు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఈ ప్రోమోలోని పెన్నీ సాంగ్ తో మహేశ్ బాబు కూతురు సితార అందరినీ ఆశ్చర్యపరిచింది.
https://youtu.be/T30RoCkiovE
మొదటి సారిగా సితార మ్యూజిక్ ఆల్బమ్ లో నటించి తన డ్యాన్స్ తో అందరినీ ఆకట్టుకుంది. సితార సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తను చేసే డ్యాన్స్ వీడియోలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. పెన్నీ సాంగ్ ఈ సినిమాలో మహేశ్ బాబు ఇన్‌ట్రడక్షన్ సాంగ్‌లా ఉంది.
ఇప్పటికే మహేశ్ బాబు కుమారుడు గౌతమ్ 1 నేనొక్కడినే సినిమాతో వెండి తెరకు పరిచయమయ్యాడు. కాగా కూతురు సితార కూడా వెండి తెరకు పరిచయం కానున్నదని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరి కొందరు ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే సితార డ్యాన్స్ చేసి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.