Jabardasth Show : బుల్లితెరపై ఈటీవీలో ప్రసారం అవుతున్న జబర్దస్త్ షోకు ఎంతో ఆదరణ లభిస్తుందన్న సంగతి తెలిసిందే. ఈ షో 2013లో ప్రారంభమైంది. క్రమక్రమంగా పాపులారిటీని సంపాదించుకుంది. ఈ క్రమంలోనే ఈ షోలో స్కిట్లు చేసిన వారు కమెడియన్లుగా మారి సినిమాల్లో చాన్స్‌లను అందుకుంటున్నారు. ఇక జబర్దస్త్ షో హిట్ కావడంతో అదే ఫార్ములాతో ఎక్స్‌ట్రా జబర్దస్త్ పేరిట ఇంకో షోను ప్రారంభించారు. ఇది కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. అయితే ఈ మధ్య కాలంలో ఈ షోలకు ఆదరణ తగ్గుతుందని తెలుస్తోంది.
జబర్దస్త్ షోలకు ఇటీవలి కాలంలో ఆదరణ తగ్గిందని.. ఈ షోలను చూసే ప్రేక్షకులు రొటీన్ స్కిట్లు, డబుల్ మీనింగ్ డైలాగ్‌లతో విసిగిపోయారని.. అందుకనే చాలా మంది వీటిని చూడడం లేదని తెలుస్తోంది. అందుకనే ఈ మధ్య కాలంలో కాంట్రవర్సీలు ఎక్కువగా ఉండేలా స్కిట్‌లను రూపొందించారు. కానీ అవి కూడా ఆశించిన మేర ఫలితాలను ఇవ్వలేదని తెలుస్తోంది. అయితే ఇవే కారణాలో.. మరేమైనా కారణాలు ఉన్నాయో తెలియదు కానీ.. జబర్దస్త్ కమెడియన్ల రెమ్యునరేషన్‌లను తాజాగా భారీగా తగ్గించేశారు. ఈ క్రమంలోనే ఈ విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
జబర్దస్త్ రెండు షోలకు యాంకర్లుగా వ్యవహరిస్తున్న అనసూయ, రష్మి గౌతమ్‌ల రెమ్యునరేషన్‌లను తగ్గించలేదు కానీ పెంచారు. అనసూయ ఒక్క జబర్దస్త్ ఎపిసోడ్‌కు రూ.50వేల నుంచి రూ.80వేలు తీసుకునేదని.. ఇప్పుడు ఆమెకు ఒక్క ఎపిసోడ్‌కు రూ.1.20 లక్షలు ఇస్తున్నారని తెలుస్తోంది. ఇక రష్మి గౌతమ్‌కు గతంలో రూ.1 లక్ష ఇవ్వగా.. ఇప్పుడు ఒక్క ఎపిసోడ్‌కు రూ.1.50 లక్షలు ఇస్తున్నారని సమాచారం.
సుడిగాలి సుధీర్ గతంలో ఒక్క ఎపిసోడ్‌కు రూ.3.5 లక్షలు తీసుకున్నాడని.. ఇప్పుడు ఆయనకు రూ.3 లక్షలు ఇస్తున్నారని తెలుస్తోంది. హైపర్ ఆదికి గతంలో రూ.3 లక్షలు ఇవ్వగా.. ఇప్పుడు రూ.2.50 లక్షలు ఇస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అలాగే రాకెట్ రాఘవకు గతంలో రూ.3 లక్షలు, ఇప్పుడు రూ.2.50 లక్షలు, జడ్జి మనోకు ఒక్క ఎపిసోడ్‌కు రూ.2 లక్షలు ఇస్తున్నారని తెలుస్తోంది. అయితే కమెడియన్ల రెమ్యునరేషన్‌ను తగ్గించడం వెనుక బలమైన కారణమే ఉందని.. షోకు ఆదరణ తగ్గడంతోపాటు స్పాన్సర్లు కూడా ఎక్కువగా రావడం లేదని తెలుస్తోంది. అందుకనే ఇలా రెమ్యునరేషన్‌లను తగ్గించారని సమాచారం. అయితే రెమ్యునరేషన్‌లు తగ్గడంతో ఈ షో నుంచి ఎవరైనా బయటకు వెళ్లిపోతారా.. అందులోనే కొనసాగుతారా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.