Ground Nuts : వేరుశెనగలను చాలా మంది ఇష్టంగా తింటారు. వీటినే కొందరు పల్లీలు అని కూడా పిలుస్తుంటారు. వీటిని తరచూ అనేక రకాల వంటల్లో వేస్తుంటారు. వీటితో తీపి వంటకాలు కూడా చేయవచ్చు. అయితే వేరుశెనగల ద్వారా మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వీటిని ఉడకబెట్టి తింటే రుచికి రుచితోపాటు పోషకాలు కూడా లభిస్తాయి. అయితే రోజూ గుప్పెడు వేరుశెనగలను ఉడకబెట్టి తింటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు.

వేరుశెనగలను రోజూ గుప్పెడు మోతాదులో ఉడకబెట్టి తినడం వల్ల అనేక లాభాలు కలుగుతాయని సైంటిస్టులు చెబుతున్నారు. ముఖ్యంగా వీటిని తింటే పురుషుల్లో ఏర్పడే అనేక సమస్యలను తగ్గించుకోవచ్చని అంటున్నారు. వేరుశెనగల్లో రెస్వెరెట్రాల్ అనబడే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది పురుషుల్లో ఏర్పడే అనేక సమస్యలను తగ్గిస్తుంది. పురుషుల్లో శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. వీర్యం అధికంగా తయారయ్యేలా చేస్తుంది. దీంతో సంతానం కలిగే అవకాశాలు పెరుగుతాయి.
కనుక పురుషులు రోజూ గుప్పెడు వేరుశెనగలను ఉడకబెట్టుకుని తింటే ఎంతో లాభం పొందవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. వీటి ద్వారా శరీరం దృఢంగా మారుతుంది. అమితమైన శక్తి లభిస్తుంది. అధిక బరువు తగ్గేందుకు ఉపకరిస్తాయి. గుండె సురక్షితంగా ఉంటుంది. ఇంకా ఎన్నో లాభాలు కలుగుతాయి.