Kiara Advani : కియారా అద్వానీ ప్రస్తుతం అటు బాలీవుడ్‌తోపాటు ఇటు టాలీవుడ్‌లోనూ వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈమె రామ్ చరణ్ 15వ సినిమాలో శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తోంది. ఇక శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కించబోయే చిత్రంలో ముందుగా కియారానే హీరోయిన్‌గా అనుకున్నారట. కానీ ఆమె ఆ సినిమాను రిజెక్ట్ చేసింది.

గతంలో ఒకసారి కియారా ఇదే విషయంపై మాట్లాడుతూ.. తాను విజయ్ దేవరకొండతో కలిసి నటించాలని కోరుకుంటున్నానని తెలిపింది. అయితే ఆమెకు ఆఫర్ వచ్చినా.. దాన్ని ఆమె తిరస్కరించింది. కారణం.. ఆమె ప్రస్తుతం రామ్ చరణ్‌తో కలిసి సినిమా చేస్తుండడమే అని తెలుస్తోంది. ఈ సినిమా వల్ల కియారా కాల్ షీట్స్ అడ్జస్ట్ కావడం లేదట. దీంతో విజయ్ తో కలిసి నటించలేనని చెప్పేసింది.
ఇక కియారా రిజెక్ట్ చేయడంతో ఆమె స్థానంలో సమంతను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. దీంతో విజయ్ దేవరకొండ పక్కన సమంత నటించనుంది. రొమాంటిక్ లవ్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో ప్రధాన భాగాన్ని కాశ్మీర్ లో తెరకెక్కిస్తారని తెలుస్తోంది. ఇక దీనిపై మరిన్ని అప్‌డేట్స్‌ను త్వరలోనే తెలియజేయనున్నారు.