Krithi Shetty : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం అత్యంత ఎక్కువ సక్సెస్‌ను సాధిస్తున్న హీరోయిన్లలో కృతి శెట్టి ఒకరు. ఈమె తొలి సినిమాతోనే హిట్ కొట్టింది. ఉప్పెనతో ఈమె విజయం సాధించి వరుస ఆఫర్లను అందుకుంటోంది. అందులో భాగంగానే ఈమె నటిస్తున్న అన్ని చిత్రాలు హిట్ అవుతున్నాయి. శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు వంటి చిత్రాలను ఈమె తన ఖాతాలో వేసుకుంది. ఇక ప్రస్తుతం రవితేజ పక్కన ధమాకా అనే సినిమాలో నటిస్తోంది. అయితే ఈమెకు ఇప్పుడు ఓ బంపర్ ఆఫర్ వచ్చింది. ఏకంగా నటుడు సూర్య సినిమాలో హీరోయిన్‌గా చేసే చాన్స్ లభించింది.
నటుడు సూర్య ఇటీవల నటించిన ఈటీ అనే సినిమా థియేటర్లలో విడుదలై మంచి టాక్‌ను సాధించింది. ఈయన అంతకు ముందు నటించిన జైభీమ్ సినిమా ఏకంగా ఆస్కార్ రేసులో నిలిచింది. దీంతో సూర్య సక్సెస్ బాటలో ప్రయాణిస్తున్నారని చెప్పవచ్చు. ఇక ఈయన త్వరలోనే దర్శకుడు బాలతో కలిసి ఓ సినిమా చేయనున్నారు. గతంతో సూర్య బాలతో చేసిన నంద, శివ పుత్రుడు సినిమాలు హిట్ అయ్యాయి. దీంతో కృతజ్ఞతా భావంతో బాల కోసం సూర్య ఓ సినిమా చేస్తున్నారు. అందులోనే కృతి శెట్టి నటించనుంది.
నటుడు సూర్యతో కలిసి చేసేందుకు కృతి శెట్టి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఆమె నటన చేసి బాలనే స్వయంగా ఆమెను సూర్య సినిమాకు ఎంపిక చేశారట. దీంతో బేబమ్మ బంపర్ ఆఫర్ కొట్టేసిందని అంటున్నారు. ఇక ఈ మూవీ షూటింగ్ ఏప్రిల్ నెలలో ప్రారంభం కానుంది.