Lizard In Home : సాధారణంగా అందరి ఇండ్లలోనూ బల్లులు ఉండనే ఉంటాయి. చాలా మంది వీటిని అసహ్యించుకుంటారు. కానీ పురాణాల ప్రకారం బల్లికి.. మంచి, చెడు శకునాలకు సంబంధం ఉందని నిపుణులు చెబుతున్నారు. చాలా మంది వీటిని నమ్మనే నమ్మరు. కానీ మన భవిష్యత్తు ఏమిటో తెలియాలంటే మన ఇంట్లో ఉండే బల్లిని గమనించాలని వారు తెలియజేస్తున్నారు. అసలు మన భవిష్యత్తును బల్లి ఎలా నిర్ణయిస్తుంది అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా బల్లులు గోడలపై ఉంటాయి. ఇంట్లోకి వచ్చే పురుగులను ఇవి తింటాయి. కానీ అదే బల్లి నేలపై పాకితే మాత్రం మన జాగ్రత్తగా ఉండాలి. ఎందుకుంటే బల్లి నేలపై పాకితే మన ఇంట్లోని వాళ్లు ఏదో ఒక జబ్బు బారిన పడబోతున్నారని పండితులు చెబుతున్నారు.
బల్లులు గోడపై ఉన్నప్పుడు గాలిలో ఉండే చెడు వాసనలను, సూక్ష్మజీవులను గుర్తిస్తాయని, ఇలా గుర్తించిన వెంటనే అవి నేల మీదికి వస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలా రాబోయే ప్రమాదాన్ని బల్లులు ముందుగానే గురిస్తాయని తెలియజేస్తున్నారు. అలాగే మన ఇంట్లో రెండు బల్లులు ఒకే చోట కలిసి ఉంటే మనం మన పాత స్నేహితులను కలవబోతున్నామని అర్థం. అంతేకాకుండా మన ఇంట్లో ఉండే బల్లులు పోట్లాడుకున్నట్టు కనబడితే మన స్నేహితులు ఎవరో మనకు దూరం కాబోతున్నారని అర్థం. ఆ సమయంలో మనం సంయమనం పాటిస్తే మన స్నేహితులు మనకు దూరం కాకుండా ఉంటారని బల్లి శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
అలాగే ఉదయం పూట బల్లి చేసే శబ్దాన్ని గనక మనం విన్నట్లయితే మనం ఏదో ఒక శుభ వార్త వినబోతున్నామని, మనకు ఏదో మంచి జరగబోతుందని అర్థం. ఎవరికైనా కలలో బల్లి కనబడితే దానికి కూడా ఒక అర్థం ఉందట. కలలో బల్లి కనిపించిన వారు ఏదో ఒక పనిని పూర్తి చేయలేదని అర్థమట. అడ్డంకుల కారణంగా ఆ పనిని పూర్తి చేయలేని వారికి ఇలా బల్లి కలలో కనబడుతుందట. ఇలా బల్లి కలలో కనిపించిన వారు ఎంత కష్టమైనా ఆ పనిని పూర్తి చేయాలని బల్లి శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇలా మనం బల్లి శకునాలను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.