Bheemla Nayak : వకీల్ సాబ్ తర్వాత పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రం భీమ్లా నాయక్.ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న విషయం కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సంచలనం అవుతున్నాయి. ఇక అనేక వాయిదాల అనంతరం ఈ సినిమా మొత్తానికి ఫిబ్రవరి నెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా రిలీజ్ కు కొద్దీ రోజుల ముందు భారీ స్థాయిలో నిర్వహించబోతున్నారు.
“భీమ్లా నాయక్” ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఈ నెల 21న నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ ఈవెంట్‌కు హాజరు కాబోతున్న ముఖ్య అతిథులకు సంబంధించిన క్రేజీ రూమర్స్ సోషల్ మీడియాలో దావానంలా వ్యాపిస్తున్నాయి.ఈ వేడుకకు మహేష్ బాబు, బాలకృష్ణ, రాజమౌళి ముఖ్య అతిధులుగా హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు అసలు ‘భీమ్లా నాయక్” ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిధులంటూ ఎవరూ లేరని వార్తలు వస్తున్నాయి. ఎలాగైనా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను మరో 2 రోజుల్లో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘భీమ్లా నాయక్’.
ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తుండగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, కథనం అందిస్తున్నారు. మలయాళంలో విడుదలై సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియం సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన భీమ్లా నాయక్ సినిమాపై మొదటి నుంచి కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీలో ఏక కాలంలో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాను హిందీలో B4U మోషన్ పిక్చర్స్ వాళ్లు రిలీజ్ చేస్తున్నట్టు అఫీషియల్‌గా పోస్టర్ కూడా ఇప్పటికే రిలీజ్ చేశారు. ఇక ఇక సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను యూసుఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్ ను వేదికగా ఫిక్స్ చేసినట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.