Double Ka Meetha : బ‌య‌ట ల‌భించే విధంగా.. డ‌బుల్ కా మీఠాను తియ్య‌గా ఇలా త‌యారు చేసుకోవ‌చ్చు..!

Double Ka Meetha : పెళ్లిళ్లు, ఇత‌ర శుభ కార్యాల స‌మ‌యంలో స‌హ‌జంగానే స్వీట్ల‌ను వ‌డ్డిస్తుంటారు. వాటిల్లో డ‌బుల్ కా మీఠా ఒక‌టి. ఇది ఎంతో తియ్య‌గా ఉంటుంది. దీన్ని ఒక‌సారి రుచి చూస్తే వ‌ద‌ల‌రు. బ్రెడ్‌తో త‌యారుచేసే ఈ స్వీట్‌ను త‌ప్ప‌నిస‌రిగా ప్ర‌తి శుభ కార్యంలోనూ వడ్డిస్తారు. అయితే కాస్త శ్ర‌మించాలే కానీ.. అదేరుచి వ‌చ్చేలా దీన్ని మ‌నం ఇంట్లోనే ఎంతో సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఇక డ‌బుల్ కా మీఠాను ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

డ‌బుల్ కా మీఠా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బ్రెడ్ – 5, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, ఎండు ద్రాక్ష – కొద్దిగా, జీడి ప‌ప్పు – కొన్ని ప‌లుకులు, నీళ్లు – అర క‌ప్పు, పంచ‌దార – ముప్పావు క‌ప్పు, పాలు – ఒక క‌ప్పు, యాల‌కుల పొడి – పావు టీ స్పూన్.

make Double Ka Meetha in this way very sweet
Double Ka Meetha

డ‌బుల్ కా మీఠా త‌యారీ విధానం..

ముందుగా బ్రెడ్ ను చిన్న ముక్క‌లుగా చేసి ప‌క్క‌న‌ పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక క‌ళాయిలో నెయ్యి వేసి వేడ‌య్యాక ఎండు ద్రాక్ష‌, జీడిప‌ప్పు ప‌లుకులు వేసి వేయించి ఒక గిన్నెలోకి తీసుకుని ప‌క్కన‌ పెట్టుకోవాలి. ఇప్పుడు అదే క‌ళాయిలో ముందుగా ముక్క‌లుగా చేసుకున్న బ్రెడ్ ను వేసి చిన్న మంట‌పై ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు కాల్చుకుని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. అదే క‌ళాయిలో పంచ‌దార, నీళ్లు పోసి పంచ‌దార క‌రిగే వ‌ర‌కు తిప్పుతూ ఉండాలి. పంచ‌దార క‌రిగిన త‌రువాత పాల‌ను పోసి మ‌రిగించాలి. పాలు మ‌రిగిన త‌రువాత మంట‌ను చిన్నగా చేసి యాల‌కుల పొడి వేసి క‌లుపుకోవాలి. త‌రువాత ముందుగా వేయించి పెట్టుకున్న బ్రెడ్ ముక్క‌ల‌ను వేసి దగ్గ‌ర పడే వ‌ర‌కు క‌లుపుకోవాలి. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టిన డ్రై ఫ్రూట్స్ ను వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే డ‌బుల్ కా మీఠా త‌యార‌వుతుంది. దీన్ని నేరుగా అలాగే తిన‌వ‌చ్చు. ఎంతో తియ్య‌గా ఉంటుంది. బ్రెడ్ తో చాలా త‌క్కువ స‌మ‌యంలోనే దీన్ని తయారు చేసుకోవ‌చ్చు.

D

Recent Posts