Malavika Mohanan : మాళవిక మోహనన్ ఈ మధ్య కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తోంది. సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ ఈమె యాక్టివ్‌గా ఉంటుంది. అందులో భాగంగానే తన గ్లామర్ ఫొటోలను ఈ భామ షేర్ చేస్తుంటుంది. అలాంటి ఫొటోలను షేర్ చేయడంలో ఈమె అందరు హీరోయిన్స్ కన్నా ఒక మెట్టు పైనే ఉంటుందని చెప్పవచ్చు. సహజంగానే మోడల్ కనుక.. ఈమె అందులోనూ రాణిస్తోంది. ఇక ఈమె చేసే పోస్టులు కూడా వివాదాస్పదం అవుతూ వైరల్ అవుతుంటాయి. తాజాగా ఈమె అలాంటిదే ఒక కామెంట్ పెట్టింది.

ఓ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ ఒక సింహం ఫొటోను షేర్ చేస్తూ కాప్షన్ పెట్టారు. అందులో.. 90 శాతం వరకు ఆడసింహాలే వేట కొనసాగిస్తాయని, మరి మగ సింహాలు ఉండేది ఎందుకు ? అని పోస్ట్ చేశారు. అయితే అందుకు మాళవిక మోహనన్ ఇచ్చిన రిప్లై వైరల్‌గా మారింది.
మాళవిక మోహనన్ ఆ అధికారి ప్రశ్నకు బదులిస్తూ.. వారికి ఆందోళన, ఆరాటం కలిగిచేందుకు.. అని కామెంట్ పెట్టింది. దీంతో నెటిజన్లు ఆమె కామెంట్‌లో రెండో మీనింగ్‌ను వెదుకుతున్నారు. మాళవిక మోహనన్ ఇలా కామెంట్ ఎందుకు చేసింది ? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె కామెంట్ వైరల్ అవుతోంది. ఇక ఈ మధ్యే ఈమె తన ఫొటోలను కొందరు మార్ఫింగ్ చేస్తున్నారని కూడా సంచలన ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచింది.